మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ కావడంతో ఇంకాస్త క్యూరియాసిటీ పెరిగింది. అసలు మేజర్ ముకుంద్ ఎందుకు అంత స్పెషల్ తెలుసుకుందాం
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సాయిపల్లవి , కార్తికేయన్ కాంభినేషనల్ లో డైరక్టర్ రాజ్ కుమార్ పెరియసామి డైరక్ట్ చేస్తున్న మూవీ అమరన్. తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది.అక్టోబర్ 31 న దీపావళి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమా డీసెంట్ హైప్ సొంతం చేసుకుంటుంది. ఇది కంప్లీట్ గా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ కావడంతో ఇంకాస్త క్యూరియాసిటీ పెరిగింది. అసలు మేజర్ ముకుంద్ ఎందుకు అంత స్పెషల్ తెలుసుకుందాం.
శ్రీ ఆర్ వరదరాజన్, శ్రీమతి గీత గార్లకు 1983 ఏప్రిల్ 12 న కేరళలో ముకుంద్ జన్మించారు. ఆయన పుట్టింది కేరళలో అయినా చదువు మాత్రం చెన్నైలోనే కంప్లీట్ చేశారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసుకున్నారు. ముకుంద్ మామయ్య , తాతయ్య ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తారు. సో డిగ్రీ తర్వాత ముకుంద్ తన మావయ్య సలహాతో ఆర్మీలో జాయిన్ అయ్యాడు.
అలా 2006 లో రాజ్ పుత్ రెజిమెంట్ మిలట్రీ ఫోర్స్ లో లెఫ్టినెంట్ గా అప్పోయింట్ అయ్యారు. అక్కడ రెండేళ్ల తర్వాత కెప్టెన్ గా ప్రమోట్ అయ్యాడు. అలా 2009 లో అతను కాలేజ్ లో ప్రేమించిన ఇందు రెబెకా వర్గీస్ ను పెళ్లి చేసుకున్నారు. 2011 లో వారిద్దరికీ ఓ కూతురు జన్మించింది. ఆర్మీలో ముకుంద్ కెప్టెన్ గా చాలా స్ట్రాంగ్ టీం ను రెడీ చేసుకున్నారు. 2012లో ఆయన కల కన్న లైఫ్ టైమ్ డ్రీం నెరవేరింది. అదేంటంటే..ముకుంద్ చేసిన సక్సెస్ ఫుల్ ఆపేరేషన్స్ ను చూసి.. 2012 లో ఇండియన్ ఆర్మీ ఆయనను 44 రాష్ట్రీయ రైఫిల్స్ టీం లో జాయిన్ అవ్వమని చెప్పింది.
ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ముకుంద్ కెప్టెన్ గా చాలా మంచి విజయాలు ..సక్సస్ ఫుల్ ఆపరేషన్స్ చేశారు. అయితే 2014 లో ఆర్మీ బేస్ నుంచి కాల్ వచ్చింది సౌత్ కాశ్మీర్ లో ఓ విలేజ్ దగ్గర కొంతమంది టెర్రరిస్ట్ లు ఉన్నారు. వారి వద్ద నుంచి డిజిటల్ డాక్యుమెంట్స్ ను రికవరీ చేసుకురమ్మని చెప్పారు. మేజర్ టీం ఆ ఉగ్రవాదిని కాల్చి.. తన దగ్గర ఉన్న మొబైల్ , డాక్యుమెంట్స్ తీసుకు వచ్చి ముకుంద్ కు ఇచ్చారు. వాటితో అల్తాఫ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు. వెంటనే ముకుంద్ తన టీం ను తీసుకుని.. ఆ ప్లేస్ కు వెళ్ళారు. ఆ ఉగ్రవాదుల టీం ఏడుగురు ఉంటె.. ముకుంద్ టీం ఐదుగురు మాత్రమే ఉన్నారు.
ఈ ఇన్సిడెంట్ లో మరో ఇద్దరు ఉగ్రవాదులు ఇంట్లో దాక్కొని ఉన్నారు. కాసేపు వెయిట్ చెయ్యాల్సిందే. కాని గ్రనైట్ పేలి చాలా సేపు అయ్యింది సో ఇక ఉగ్రవాదులు ఎవ్వరు ఉండరనుకొని ముకుందన్ లోపలి వెళ్లారు. దీంతో ఇంట్లో ఉన్న అల్తాఫ్ ముకుందన్ పై కాల్పులు జరపడంతో ముకుందన్ చనిపోయారు. కాల్పులు జరిగినా టెర్రరిస్ట్ దగ్గర ఉన్న అతని దగ్గర ఉన్న మొబైల్ , ల్యాప్ టాప్ ను తీసుకుని వారి టీం కు ఇచ్చి.. ఆపేరేషన్ సక్సెస్ అని చెప్పి అక్కడే కన్నుమూశారు. మేజర్ టీం ఆ డిజిటల్ డేటా ను అఫీషియల్స్ కు ఇచ్చారు. దానిని డీకోడ్ చేస్తే తెలిసిన విషయం ఏంటటంటే.. ఆ ఉగ్రవాదులు జరగబోయే జమ్మూ & కాశ్మిర్ ఎలెక్షన్స్ ను టార్గెట్ చేశారు. మేజర్ కు తెలీకుండానే ..అల్తాఫ్ ను మాత్రమే చంపి మిగిలిన వారిని చంపకపోతే ఇండియాకు చాలా నష్టం కలిగేది.
మేజర్ ముకుంద్ త్యాగానికి గుర్తుగా ఇండియన్ గవర్నమెంట్ 2015 జనవరి 26న ‘అశోక చక్ర’ అవార్డు ఇచ్చింది. అంతే కాకుండా తమిళ నాడు రాష్ట్రం నుంచి అశోక చక్ర అవార్డు పొందిన నాల్గవ వ్యక్తి మేజర్ ముకుంద్.మేజర్ ముకుందన్ లెగసిని అందరికి తెలియజేయడమే అమరన్ మూవీ మెయిన్ రీజన్. మేజర్ ముకుందన్ అమర్ రహే.