Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం.. స్పందించిన అమూల్ !

మేమే నెయ్యి సరఫరా చేశామని సోషల్ మీడియా లో చాలా జోరుగా ప్రచారం జరుగుతుంది. అమూల్ మాతృసంస్థ గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) స్పష్టం చేసింది.


Published Sep 23, 2024 11:58:00 AM
postImages/2024-09-23/1727072949_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ వివాదంపై ఇండియన్ డైరీ బ్రాండ్ అమూల్ స్పందించింది. తిరుమల దేవస్థానికి తామెప్పుడు నెయ్యి పంపలేదని ..చేయలేదని వివరణ ఇస్తూ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. టీటీడీ కి మేమే నెయ్యి సరఫరా చేశామని సోషల్ మీడియా లో చాలా జోరుగా ప్రచారం జరుగుతుంది. అమూల్ మాతృసంస్థ గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) స్పష్టం చేసింది.


‘‘అంతేకాదు అమూల్ నెయ్యిని మా అత్యాధునిక ఉత్పత్తి సౌకర్యాలలో పాల నుంచి తీస్తాం. మేం చేసే నెయ్యిలో తేడా రాదు. అత్యంత నాణ్యత కలిగిన శుధ్ధమైన మిల్క్ ఫ్యాట్ నుంచి అమూల్ నెయ్యిని ఉత్పత్తి చేస్తాం. మా డెయిరీ లో పాలను పూర్తిగా శుభ్రంగా ఫిల్టర్ చేశాకే నెయ్యిని చేస్తాం.


`తిరుమల స్వామివారి ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేసే లడ్డూలలో జంతువుల కొవ్వును, నాణ్యత లేని పదార్థాలను ఉపయోగించారంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అన్ని రాష్ట్రాల పెద్దలు..అయోధ్య ఆలయం అన్నిదేవాలయాలు అర్చకులు కూడా దీనిపై స్పందించారు. ఈ వివాదం చివరికి సేప్రీం కోర్టుకు కూడా చేరింది. దీంతో పాటు అమూల్ డైరక్టర్ సైబర్ క్రైమ్ వాళ్లకి కంప్లైయింట్ ఇచ్చారు. తిరుమల దేవాలయంలో తమ నెయ్యి కాదని స్పష్టించింది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ghee ttd tirumala-laddu

Related Articles