తేమ, ఆక్సిజన్‌తో తాకినప్పుడు అవి తుప్పు పట్టడం, ఉబ్బడంతో రాళ్ళు పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఈ సమస్య పురాతన కోటలున్న ప్రతి ప్రాంతంలోను జరుగుతుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రేమ గుర్తుకు పగుళ్లు చేరుతున్నాయి. ఏమైందో ఏమో తాజ్ మహాల్ కు పగుళ్లు ప్రారంభమయ్యాయి.ప్రధాన సమాధి భాగాలు, గోడలు బీటలు వారాయి. గోపురం మార్బుల్‌లో కూడా పగుళ్లు ఉన్నాయని టూరిస్ట్ గైడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దీపక్ ధన్ తెలిపారు.మరోవైపు, మొఘలుల కాలంలో నిర్మించిన కట్టడాల్లోని రాళ్ల కీళ్లను పటిష్టం చేసేందుకు ఉపయోగించే ఇనుప గొలుసులు, రాడ్లు ఇప్పుడు సమస్యగా మారుతున్నాయి. అవి తేమ, ఆక్సిజన్‌తో తాకినప్పుడు అవి తుప్పు పట్టడం, ఉబ్బడంతో రాళ్ళు పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఈ సమస్య పురాతన కోటలున్న ప్రతి ప్రాంతంలోను జరుగుతుంది.
తాజ్‌మహల్ గోపురం చుట్టూ ఉన్న తలుపులపై అరబిక్‌లో రాసి ఉన్న ఖురాన్ శ్లోకాలు చెరిగిపోయాయని అంటున్నాు.అయితే గోడలలో పొందు పరిచిన విలువైన రాళ్లు కూడా ఇక లాస్ట్ స్టేజ్ కు వచ్చేశాయని అంటున్నారు. తాజ్ మహాల్ లో చాలా ప్రాంతాల్లో ఈ పగుళ్లు చాలా కామన్ అయిపోయాయని అంటున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షానికి తాజ్‌మహల్ ప్రధాన గుమ్మటం నుంచి నీరు కారడమే కాక, కట్టడం ముందున్న తోట నీట మునిగిందనే వార్తలు కూడా ఉన్నాయి. అయితే వర్షాకాలంలోనే తాజ్ మహాల్ కు కాస్త ఇబ్బందులని మిగిలిన సమయంలో ఇంత దారుణంగా ఉండదని అంటున్నారు. చలి కాలంలో పొల్యూషన్ తో ...చిన్న చిన్న ఇబ్బందులే కాని తాజ్ అందానికి ఢోకా లేదంటున్నారు పురావస్తు శాఖ వారు.