అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు(Maoists)ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆ ప్రాంతంలో పోలీసులు కోపింగ్ జరుపుతుండగా మావోయిస్టులు తారసపడినట్లు తెలుస్తోంది. హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో 11 మావోలు హతమైనట్లు సమాచారం.
న్యూస్ లైన్ డెస్క్: ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మంగళవారం మధ్యాహ్నం నారాయణ్‌పూర్(Narayanpur) జిల్లాలో భారీగా కాల్పులు జరిగాయి. కొహకమెట్ పీఎస్ పరిధిలోని ధనంది-కుర్రేవాయ మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు(Maoists)ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆ ప్రాంతంలో పోలీసులు కోపింగ్ జరుపుతుండగా మావోయిస్టులు తారసపడినట్లు తెలుస్తోంది. హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో 11 మావోలు హతమైనట్లు సమాచారం. కాగా, ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో పలుమార్లు పోలీసులు జరిపిన కాల్పుల్లో మావోలు మృతిచెందిన విషయం తెలిసిందే.