టెక్నాలజీ పెరిగింది మనం ఏ బ్యాంకుకు వెళ్లిన ఏదైనా అప్లై చేయాలన్నా పాన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా అడుగుతున్నారు. ఇది ఒక్కోసారి మన పాన్ కార్డులో కానీ, ఆధార్ కార్డులో కానీ తప్పులు
న్యూస్ లైన్ డెస్క్: టెక్నాలజీ పెరిగింది మనం ఏ బ్యాంకుకు వెళ్లిన ఏదైనా అప్లై చేయాలన్నా పాన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా అడుగుతున్నారు. ఇది ఒక్కోసారి మన పాన్ కార్డులో కానీ, ఆధార్ కార్డులో కానీ తప్పులు ఉంటాయి. ఇక్కడ ఒక పేరు ఉంటే మనం అప్లై చేసే దాంట్లో మరో పేరు ఉంటుంది. అంతేకాదు పాన్ కార్డులో ఆధార్ కార్డులో ఒకే విధమైన పేరు ఉంటేనే ఏదైనా క్లియర్ గా అప్లై చేసుకోగలం. బ్యాంకులో అయితే ముఖ్యంగా పాన్ కార్డులో ఉన్న పేరే మీ బ్యాంక్ అకౌంట్ లో కూడా ఉండాలి. అలా లేనప్పుడు ఒక్కోసారి మనం ఏదైనా లోన్ అప్లై చేస్తే రిజెక్ట్ అవుతుంది.
మరి అలా పాన్ కార్డులో తప్పు పేరు ఉంటే చేంజ్ చేసుకోవడానికి చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏదైనా నెట్ సెంటర్, మీ సేవ సెంటర్ కి వెళ్లి లైన్ కడుతూ ఉంటారు. అలాకాకుండా మన మొబైల్ ఫోన్లోనే ఈజీగా మన పాన్ కార్డులో ఫోటో, సిగ్నేచర్, నేమ్స్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మీ మొబైల్ ఫోన్లోనే పాన్ కార్డులో మీ పేరు, డేట్ అఫ్ బర్త్, సిగ్నేచర్, ఫోటో అన్ని రెండు నిమిషాల్లో మార్చుకోవచ్చు. మీ మొబైల్ లో ఎన్ఎస్ డిఎల్ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. అప్లికేషన్స్ దగ్గర చేంజెస్ కరెక్షన్ ఇన్ ఎక్సేస్టింగ్ పాన్ డేటా మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్యాటగిరిలో ఇండివిజువల్ చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి అప్లికేషన్స్ లో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. చివరగా మీ పాన్ కార్డు నెంబరు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ కొట్టాలి.
ఆ తర్వాత టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది దాన్ని మనం ఒక పేపర్ లో రాసుకోవాలి. ఆ తర్వాత కంటిన్యూ ఎంటర్ చేయగానే, మీకు ఏదైతే చేంజ్ చేయాలో ఆ ఆప్షన్ లోకి వెళ్లి క్లియర్ గా ఉండే నేమ్ లేదా డేట్ అఫ్ బర్త్, ఫోటో చేంజ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత చివరలో పేమెంట్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపై ఎంటర్ చేయగానే జీఎస్టీతో కలిపి 106.90 అనే ఆప్షన్ చూపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు పేమెంట్ కడతాఓ నువ్వు చేంజ్ చేసిన వివరాలతో కొత్త పాన్ కార్డు మీ ఇంటికి పోస్ట్ ద్వారా వస్తుంది. కాబట్టి ఎవరైనా పాన్ కార్డులో తప్పులు ఉంటే వెంటనే ఈ ప్రాసెస్ ద్వారా కొత్త పాన్ కార్డు పొందండి.