AYODHYA: అయోథ్య రాముడు తొలి దీపావళి చేసుకోబోతున్నాడు !

తొలి దీపావాళి కావడంతో  రామునికి అంగరంగ వైభవంగా పూజలు కూడా చేయాలనుకుంటున్నారు. 


Published Oct 24, 2024 05:12:00 PM
postImages/2024-10-24/1729770187_RamJanmbhoomiMandirAyodhyaDham.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఈ దీపావళి వేడుకలను అయోధ్యలో చాలా అట్టహాసంగా నిర్వహించాలనుకుంటున్నారు . గిన్నిస్ బుక్ సాధించేంత గొప్పగా ఈ సంబరాలు జరగాలనుకుంటుంది యోగీ సర్కార్. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో అక్టోబర్ 28 నుండి 30 వరకు రామనగరి అయోధ్యలో దీపావళి వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. బాలరాముడు కొలువైన తర్వాత జరుగుతున్న తొలి దీపావాళి కావడంతో  రామునికి అంగరంగ వైభవంగా పూజలు కూడా చేయాలనుకుంటున్నారు. 


సాకేత్ నుండి నాలుగు కిలో మీటర్ల వరకు కళాకారుల రామాయణ ఘట్టాల ప్రదర్శనతో ఊరేగింపు సాగనుంది. లక్ష్మణ్ కిలా ఘాట్ నుండి కొత్త ఘాట్ వరకు 1100 మంది వేద పండితులతో సరయు నది హారతి నిర్వహించి గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టిస్తుందని తెలిపారు.


ఈ దీపావళి వేళ దీపోత్సవంతో పాటు వివిధ దేశాల సంస్కృతిని మన ప్రజలకు పరిచయం చేయనున్నారు. ఆరు దేశాల కళాకారులు రామలీలను ప్రదర్శించనున్నారు.థాయిలాండ్, కంబోడియా, ఇండోనేషియా, మయన్మార్, మలేషియా, నేపాల్ దేశాల కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  ఈ కార్యక్రమంలో 16 రాష్ట్రాల కళాకారులు పాల్గొంటారు. కాశ్మీర్ , ఉత్తరాఖండ్ , హర్యానా , మధ్యప్రదేశ్ , పంజాబ్ , మహారాష్ట్ర , అస్సాం, గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ , జార్ఖండ్ , రాజస్థాన్, బీహార్ , ఛండీగడ్ , సిక్కిం, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల ఉద్యానవనం విదేశీ కళాకారులు ప్రదర్శనలు ఇస్తారు. డ్రోన్ షో , మ్యూజికల్ లేజర్ షో  ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ayodhya sriram diwali

Related Articles