Amaravati Railway Project: అమరావతి రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఏపీ రాజధాని అమరావతి నగరాన్ని హైదరాబాద్ , కోలకత్తా , చెన్నై నగరాలకు అనుసంధానం చేసేలా రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని ఫిక్స్ అయ్యారు


Published Oct 24, 2024 04:30:00 PM
postImages/2024-10-24/1729767717_amaravatirailwayline.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అమరావతి రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్ట్ కు కేంద్ర క్యాబినేట్ పచ్చజెండా ఊపింది. ఏపీ రాజధాని అమరావతి నగరాన్ని హైదరాబాద్ , కోలకత్తా , చెన్నై నగరాలకు అనుసంధానం చేసేలా రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని ఫిక్స్ అయ్యారు . దీనికి కేంద్రం 2,245 కోట్ల వ్యయంతో 57 కిలోమీటర్ల వరకు కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఈ క్రమంలో కృష్ణా నది పై వంతెన కూడా వస్తుంది. 


ఈ రైల్వే లైన్ తో అమరావతికి దక్షిణ, మధ్య, ఉత్తర భారతదేశంతో అనుసంధానం ఏర్పడుతుంది. ఈ రైల్వే ప్రాజెక్టుకు మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను కూడా అనుసంధానించనున్నారు. ఈ నిర్మాణం జరిగితే చిన్న ఊర్ల నుంచి  పెద్ద నగరాల వరకు రైల్వే ట్రాక్స్ నిర్మాణం మరింత మెరుగవుతుందని అంటున్నారు . 

newsline-whatsapp-channel
Tags : andhrapradesh newslinetelugu train railway-department

Related Articles