DEVARAGATTU SAMARAM: ఈ " దేవరగట్టు కర్రల సమరం ..మరో దేవర సినిమానే !

హింసాత్మక పనులు ఏం జరగకుండా పోలీసులు చాలా ప్లాన్లు చేసుకున్నారు అయినా అవేం ఫలించలేదు. 70 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు.


Published Oct 13, 2024 02:33:00 PM
postImages/2024-10-13/1728810473_devaragattukarralasamaram.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : దేవరగట్టు కర్రల సమరంలో ఎలాంటి హింస జరగకుండా ఆపేందుకు పోలీసులు ముందస్తుగా చేపట్టిన చర్యలు ఫలించలేదు. హింసాత్మక పనులు ఏం జరగకుండా పోలీసులు చాలా ప్లాన్లు చేసుకున్నారు అయినా అవేం ఫలించలేదు. 70 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన పడిన వాళ్లను ఆసుపత్రికి తరలించగా వారిలో ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిపారు పోలీసులు.


ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టు ప్రాంతంలో ఏటా దసరా రోజు అర్ధరాత్రి బన్ని ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం లో కర్రల సమరం ఉంటుంది. అంటే కర్రలతో రెండు గ్రూపులు కొట్టుకుంటారు. చాలా యేళ్లుగా ఈ ఆచారం నడుస్తుంది. . దేవతామూర్తుల కోసం ఈ కర్రల సమరం జరుగుతుంది. ఈ కర్రల సమరంలో ఎవరైతే గెలుస్తారో వారికే ఆ దేవాతామూర్తులు దొరుకుతాయి. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో 70 మంది గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు.


కర్నూలు జిల్లా ఆలూరు సమీపంలోని దేవరగట్టు వద్ద కొండపై వెలిసిన మాళమల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. ఎప్పటిలాగే దేవతామూర్తులైన మాళమ్మ, మల్లేశ్వరస్వామికి దసరా రోజు అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణం నిర్వహించారు. అనంతరం కొండకు సమీప ప్రాంతాల్లో పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురుబసవన్న గుడి మీదుగా దివిటీల వెలుగుల్లో ఆ దేవతామూర్తుల విగ్రహాలను ఊరేగిస్తారు. ఆ విగ్రహాలు లక్ష్యంగా 5 గ్రామాలు ప్రజలు ఒక జట్టుగా ...3 గ్రామాలు మరో జట్టుగా మారికర్రలతో సమరానికి దిగుతారు. దీనినే దేవరగట్టు కర్రల పోరు అంటారు.


తమ ఇలవేల్పు అయిన దేవతామూర్తులను స్వాధీనం చేసుకోవటం కోసం నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఓ జట్టుగా ఏర్పడ్డారు.  ఈ ఉత్సవంలో ఎలాంటి హింసా జరగకుండా ఉండడానికి దాదాపు 800 మంది పోలీసులు రంగంలోకి దిగారు.దేవగట్టు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘాను పటిష్ఠం చేసినప్పటికీ రక్తం చిందింది.  ప్రాణ నష్టం జరగకపోయినా పరిస్థితి చాలా విషమంగా ఉంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu dasara

Related Articles