Jani Master: జానీ మాస్టర్‌కు భారీ ఊరట.. బెయిల్‌ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు

దీంతో జానీ మాస్టర్ పై సెప్టెంబర్ 16 వతేదీన  నార్సింగి పోలీసులు 376,506,323 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.


Published Oct 24, 2024 02:29:00 PM
postImages/2024-10-24/1729760404_janimaster.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నజానీమాస్టర్ కు భారీ ఊరట లభించింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనపై జానీ మాస్టర్ కు ఊరట లభించింది. తన అసిసెంట్ ను లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు పోలీసులకు పిర్యాధు చేసింది. దీంతో జానీ మాస్టర్ పై సెప్టెంబర్ 16 వతేదీన  నార్సింగి పోలీసులు 376,506,323 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 


ఆ త‌ర్వాత కోర్టు ఆయన‌కు రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలులో ఉంటున్నారు. జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నేపథ్యంలో అక్టోబ‌ర్‌ 6 నుంచి 9 వరకు జానీ మాస్ట‌ర్‌కు కోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్‌ మంజూరు చేసింది. ఆ గడువు ముగిసిన త‌ర్వాత‌ మళ్లీ జైలుకు వెళ్లారు.  అయితే ఈ మధ్యలో తన నేషనల్ అవార్డును క్యాన్సిల్ కూడా చేశారు. అయితే ఆ కేసులో జానీ మాస్టర్ కు తెలంగాణ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జానీ మాస్టర్ ఈ రోజు సాయంత్రం చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bail-petition court johnmaster

Related Articles