hollywood: టార్జాన్ హీరో ఇక లేరు !

వయసు కారణంగా వచ్చే అనారోగ్యసమస్యలే ఆయన మరణానికి కారణమని హాలీవుడ్ ఇండస్ట్రీ తెలిపింది.


Published Oct 24, 2024 11:29:00 AM
postImages/2024-10-24/1729749628_tarzanheroronelydies931729742483.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రముఖ హాలీవుడ్ టీవీ సీరిస్ టార్జాన్ హీరో కన్నుమూశారు. టార్జాన్ హాలివుడ్ లోనే కాదు అన్ని దేశాల్లోను చాలా ఫేమస్. ఒకప్పటి చిన్నపిల్లలకి ..టార్జాన్ ఓ డ్రీమ్ రోల్. సినీ ప్రేమికులకు టార్జాన్ చాలా చాలా ఇష్టపడేవారు. అయితే ఈ సీరిస్ హీరో రాన్ ఎలీ కన్నుమూశారు.రాన్ ఎలీ 86 సంవత్సరాల వయస్సులో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె కిర్​స్టెన్​ ఎలీ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. అయితే వయసు కారణంగా వచ్చే అనారోగ్యసమస్యలే ఆయన మరణానికి కారణమని హాలీవుడ్ ఇండస్ట్రీ తెలిపింది.


నటుడిగా, రచయితగా, కోచ్‌గా, గురువుగా, కుటుంబ వ్యక్తిగా, నాయకుడిగా రాణించిన బహుముఖ వ్యక్తి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ పవర్ పుల్​ పాజిటివ్​ వైబ్స్​ను క్రియేట్ చేసేవారు. ఆయన ప్రభావం ఇతరులపై ఎప్పుడూ ఉండేది. అలా ప్రభావం చూపే వ్యక్తులను ఆయన్ను తప్ప ఇంకెవరినీ చూడలేదు. అంటూ తన కూతురు తన సోషల్ మీడియాలో ఎమోషనల్ ట్వీట్ వేశారు. రాన్ ఎప్పుడు స్ట్రాంగ్ నిర్ణయాలతో , స్మార్ట్ గా ఉండేవారని ఆయన కుటుంబసభ్యులతో చాలా సెన్సిటివ్ గా ఉండేవారని అన్నారు.


రాన్ ఎలీ మరణం హాలీవుడ్ సినీ పరిశ్రమకు తీరని లోటు అని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : holly-wood newslinetelugu hero hollywood died

Related Articles