MOVIES: సౌత్ సినిమాల్లో ను ఈ పది సినిమాలు అస్సలు మిస్ చెయ్యకూడదు !

కాని సౌత్ లో పాన్ ఇండియా లెవెల్ లో హిట్టు కొట్టని సినిమాలు చాలా ఉన్నాయి. వాటిని చెప్పండి . సౌత్ సినిమాలకు ఫిధా అయిపోతారు. 


Published Oct 24, 2024 03:49:00 PM
postImages/2024-10-24/1729765307_1286630188bestsouthindianmovies202310.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: సౌత్ సినిమాలు ఈ మధ్య ఫుల్ ఫామ్ లో ఉన్నాయి. ఆఫీస్ లోనో...ఇంటి దగ్గరో ఎక్కడో ఒక దగ్గర అసలు మీ సౌత్ లో మంచి సినిమాలు చెప్పు...చూస్తాం అంటే ఏం చెప్తారు.. టక్కున బాహుబలి , ఆర్ ఆర్ ఆర్ లాంటి సూపర్ డూపర్ హిట్లు చెప్పేస్తారు.  కాని సౌత్ లో పాన్ ఇండియా లెవెల్ లో హిట్టు కొట్టని సినిమాలు చాలా ఉన్నాయి. వాటిని చెప్పండి . సౌత్ సినిమాలకు ఫిధా అయిపోతారు. 


కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు సౌత్ ప్రతీకగా నిలిచింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలకు చెందిన ఈ పది సినిమాలు అద్భుతమైనవి. వీటిని ప్రతి సినిమా లవర్ ఖచ్చితంగా చూడాలి అవేమిటో చూద్దాం... 


* త్యాగరాజన్ తెరకెక్కించిన సూపర్ డీలక్స్ మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. విజయ్ సేతుపతి, ఫహద్ కీలక రోల్స్ చేశారు. 


* నాగ్ అశ్విన్ ప్రాణం పెట్టి తెరకెక్కించిన చిత్రం మహానటి. లెజెండరీ హీరోయిన్ సావిత్రి బయోగ్రఫీ . కీర్తి సురేష్ నేషనల్ అవార్డు గెలుచుకుంది. సూపర్ సినిమా.


* 2018లో విడుదలైన తమిళ చిత్రం 96. సి. ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు. త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించారు. సూపర్ లవ్ స్టోరీ . ఎవ్వరికైనా నచ్చుతుంది. 


* సుకుమార్ కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది రంగస్థలం. రామ్ చరణ్ లోని నటుడ్ని తట్టిలేపిన చిత్రం. అప్పటి వరకు రామ్ చరణ్ వేరు ...ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వేరు. యాక్టర్ గా రామ్ చరణ్ ను ఏ మెట్టు పైకి లేపిన సినిమా ఇది.


* అరుణ్ ప్రభు తెరకెక్కించిన తమిళ చిత్రం అరువి. ఒక అమ్మాయి స్ట్రగుల్స్ ని చక్కగా చూపించిన పొలిటికల్ థ్రిల్లర్. అరువి ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది. ఈ సినిమా చూశాక చాలా సేపు మీరు ఈ సినిమా ఫీల్ లోనే ఉంటారు.


* రామ్ రెడ్డి తెరకెక్కించిన కామెడీ డ్రామా తితి. బలగం మూవీ ఈ తితి చిత్రానికి దగ్గరగా ఉంటుంది. 2015లో విడుదలైన ఈ కన్నడ చిత్రం మంచి విజయం అందుకుంది. 


* సుడాని ఫ్రమ్ నైజీరియా అద్భుతమైన చిత్రాల్లో ఒకటి. ఈ మలయాళ చిత్రానికి జకారియా మహమ్మద్ దర్శకత్వం వహించారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా. చాలా  బాగుంటుంది. 


* దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన డార్క్, రా అండ్ రస్టిక్ డ్రామా విచారణ. అమాయకులపై పోలీసుల అకృత్యాలను వాస్తవ పరిస్థితులకు దగ్గరగా చెప్పారు. నాకు తెలిసి చాలా వరకు సౌత్ వాళ్లే ఈ సినిమా చూసి ఉండరు. కాని సూపర్ సినిమా ...మీరు కాని మూవీ లవర్స్ అయితే పక్కా సినిమా చూడండి.


* వెంకటేష్ మహా తెరకెక్కించిన కేరాఫ్ కంచరపాలెం అప్పట్లో హాట్ టాపిక్. ఒక వ్యక్తి జీవితంలో వివిధ దశల్లో జరిగిన ప్రేమ కథల సమాహారమే కేర్ ఆఫ్ కంచరపాలెం. మీరు కాని సినిమా మనసు బాలేనపుడు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. వెంకటేష్ మహా సినిమా ఇదే సూపర్ ఫీల్ గుడ్ మూవీ.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tollywood movies movie-news kollywood

Related Articles