Ayodhya : మీరు నమ్మినా నమ్మకపోయినా ..ఇది అయోధ్యే..రామమందిర రోడ్లే

ఈ మధ్య అన్ని రాష్ట్రాల్లోను వర్షాలే కదా...ఈ తేలికపాటి వర్షాలకు కూడా అయోధ్య రోడ్లు ...నదిలా నీళ్లు నిలబడిపోతున్నాయి. మోకాళ్లలోతు నీటితో రోడ్లు( roads) , వీధులు చెరువులను తలపిస్తున్నాయి. రామమందిరం ( ram mandir) సమీపంలోని నివాసాలు పూర్తిగా నీటిలో చిక్కుకున్నాయి. చాలా ప్రాంతాల్లో బైకులు, కార్లు మునిగిపోయాయి. 


Published Jun 28, 2024 02:58:00 PM
postImages/2024-06-28/1719566925_ayodhya.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ మధ్య అన్ని రాష్ట్రాల్లోను వర్షాలే కదా...ఈ తేలికపాటి వర్షాలకు కూడా అయోధ్య రోడ్లు ...నదిలా నీళ్లు నిలబడిపోతున్నాయి. మోకాళ్లలోతు నీటితో రోడ్లు( roads) , వీధులు చెరువులను తలపిస్తున్నాయి. రామమందిరం ( ram mandir) సమీపంలోని నివాసాలు పూర్తిగా నీటిలో చిక్కుకున్నాయి. చాలా ప్రాంతాల్లో బైకులు, కార్లు మునిగిపోయాయి. 


లోకల్ పీపుల్ ( locals) మోకాళ్లలోతు నీటిలో నడుస్తూ ఇళ్లకు చేరుకుంటున్నారు. వర్షం పడిన ప్రతిసారీ తమకు ఈ తిప్పలు తప్పవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామ మందిర నిర్మాణం జరిగాకైనా అయోధ్య( ayodhya)  రాత మారలేదంటున్నారు అయోధ్య జనాలు. రామ మందిర దర్శనానికి వచ్చే భక్తుల కష్టాలకు లెక్కే ఉండదని వాపోతున్నారు. రోజుకు 2 వేల నుంచి 2,500 మంది వస్తుంటారని, వారు ఎదుర్కునే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావని చెబుతున్నారు.


బైకులు( bikes) , ఇతర వాహనాలు వీధుల్లోకి రాలేవని పేర్కొంటున్నారు. అంతేకాకుండా భవన నిర్మాణాల ప్లాన్లలోనూ చాలా లోపాలు ఉన్నాయని చెబుతున్నారు. రీసెంట్ గా ఈ వర్షాలకు అయోధ్య ( ayodhya)  రామమందిరంలో కూడా ...నీరు లీక్ అవుతుందని ప్రధాన అర్చకుడే కమిటీకి కంప్లయింట్ చేశారు.రాముడు తమ వాడని, అయోధ్యను తాము కట్టామని గొప్పగా చెప్పుకునే బీజేపీ పదేళ్ల పాలనను ఎండగడుతున్నారు యాంటీ బీజేపీ జనాలు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bjp ayodhya

Related Articles