ఎన్డీయే కూటమిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీగా బడ్జెట్ కేటాయింపులు చేసింది. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీ మీద కేంద్ర ప్రభుత్వం తెగ ప్రేమ ఒలకబోసింది. కాగా.. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
న్యూస్ లైన్, ఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు నిధుల వరద కురిపించారు ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వీటితో పాటు అవసరాన్నిబట్టి ఇంకొన్ని నిధులు కూడా కేటాయిస్తామని స్పష్టం చేశారు. అటు పోలవరం ప్రాజెక్టు విషయాన్ని కూడా ప్రాజెక్టులో ప్రస్తావించారు. పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు, సాయం అందజేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఒక్క ఏపీకి మాత్రమే కాదు... భారత దేశ ఆహార భద్రతకు చాలా కీలకమైనది అని వివరించారు.
A journalist asked me this morning about my expectations for Telangana from Union Budget
Told him that we will get the same thing that we got for last 10 years
A Big Zero — KTR (@KTRBRS) July 23, 2024
ఏపీకి ఓకే.. మరి తెలంగాణకు..?
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి భారీగా నిధులు కేటాయించిన కేంద్రం... తెలంగాణ రాష్ట్రం పేరును కూడా ప్రస్తావించలేదు. ఒక్క హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు అనే వ్యాక్యం తప్ప ఏమీ లేదు. మొత్తానికి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జీరో నిధులు కేటాయించారు.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలు ఉంటే.... దాంట్లో బీజేపీకి 8, కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. మిగతా ఒక సీటు ఎంఐఎం. రెండు జాతీయ పార్టీల ఎంపీలు ఉన్నా... కనీసం బడ్జెట్ పై ఏ ఒక్క ఎంపీకి కూడా మాట్లాడకపోవడం దురదృష్టకరం.