ఈ క్రమంలో భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురుకాల్పులతో సెర్చ్ ఆపరేషన్ ఎన్ కౌంటర్ గా మారింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : జమ్ము కాశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతుంది. పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం . పుల్వామా జిల్లాలోని థ్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం ఉంది. పోలీసులు కార్డన్ సెర్చ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురుకాల్పులతో సెర్చ్ ఆపరేషన్ ఎన్ కౌంటర్ గా మారింది.
మరోవైపు, జమ్ముకశ్మీర్‌లో 48 గంటల్లో ఎన్‌కౌంటర్ జరగడం ఇది రెండోసారి. మంగళవారం షోపియాన్ ప్రాంతంలోని జిన్‌పాథర్ కెల్లర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అయితే వీరిని లష్కరే తోయిబా సభ్యులుగా అధికారులు గుర్తించారు. కశ్మీర్ లోయలో పలు దాడులకు పాల్పడినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. అయితే దీనికి భద్రతా బలగాలు ఆపరేషన్ కెల్లర్ అని పేరు పెట్టారు.