మేం ఆఫరేషన్ సిందూర్ కు బయపడిపోయాం అనుకుంటున్నారు. కాని ఇది ధైర్యవంతుల దేశమని వారు మరిచిపోయారు అని షరీఫ్ వ్యాఖ్యానించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మొగున్ని కొట్టి మొసలికన్నీళ్లు పెట్టిందట పెళ్లాం అలా ఉంది పాకిస్థాన్ పరిస్థితి. దాడులు జరిపింది వాళ్లు ...అమాయకప్రజలను కోల్పోయింది భారత్ ...వాళ్లకు న్యాయం చెయ్యడానికి టెర్రరిస్ట్ క్యాంపుల్ని టార్గెట్ చేసి మట్టుబట్టించింది . టెర్రరిస్ట్ క్యాంపుల్నికాల్చేస్తే పాకిస్థాన్ ఎందుకో చాలా బాధపడిపోతుంది. తమ దేశ ప్రజలపై దాడులు జరిపినందుకు కచ్చింతగా ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ప్రధాని షరీఫ్ తెలిపారు. భారత్ కు దీటుగా సమాధానం ఎలా ఇవ్వాలో పాకిస్తాన్ కు బాగా తెలుసు. మేం ఆఫరేషన్ సిందూర్ కు బయపడిపోయాం అనుకుంటున్నారు. కాని ఇది ధైర్యవంతుల దేశమని వారు మరిచిపోయారు అని షరీఫ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు పాక్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత సైనిక చర్య చేపట్టిన నేపథ్యంలో పాకిస్థాన్ అప్రమత్తమైంది. ఆ దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. అన్ని హాస్పటిల్స్ , వైద్యసిబ్బంది అత్యవసర విధుల్లో ఉండాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 48 గంటల పాటు గగనతలాన్ని మూసివేసినట్లు ప్రకటించింది. కానీ బుధవారం సాయంత్రానికే ప్రధాన మార్గాల్లో ఫైట్స్ రాకపోకడం పునరుధ్ధరిస్తున్నట్లు వెల్లడించింది. పాక్ సర్కార్ - ఇస్లామాబాద్ , పంజాబ్ లలో విద్యాసంస్థలు మూసివేసింది. బలగాలను సిధ్దం చేసింది. అయితే మరోవైపు భారత్ జరిపిన దాడుల్లో 26 మంది పాక్ పౌరులు ప్రాణాలు కోల్పోయారని, 46 మందికి గాయాలయ్యాయని పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ (ISPR) డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. వారంతా అమాయక ప్రజలని వీరిపై దాడి చేయడం పై తెగ బాధపడిపోతుంది .
భారత్ చేసిన ఈ వైమానిక దాడుల తర్వాత, పాకిస్థాన్ నియంత్రణరేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భారీగా కాల్పులు జరుపుతోంది. ముఖ్యంగా సరిహద్దు గ్రామాలు, ప్రజల ఇళ్లపై మోర్టార్లు, ఫిరంగులను ప్రయోగించింది. పాక్ కాల్పుల్లో సరిహద్దు గ్రామాలకు చెందిన 15 మంది ప్రాణాలు కోల్పోగా, 43మంది గాయపడినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది.