భారత భూభాగంలోకి డ్రోన్లు అనుమతించమని ఇండియా తేల్చి చెప్పింది. తొలి రౌండ్ చర్చలు దాదాపు గంటసేపు సాగాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భారత్ పాకిస్థాన్ డీజీఎంవోల మధ్య చర్చలు ముగిశాయి. హాట్ లైన్ ద్వారా చర్చలు జరిగాయి. పాకిస్తాన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చింది భారత్ . పాక్ ముందు భారత్ చాలా కండీషన్స్ పెట్టింది. కాల్పుల విరమణ ఉల్లంఘించినందుకు పాక్ ను ప్రశ్నల వర్షం కురిపించింది. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భారత్ కు సహకరించాలని డీజీఎంవో కోరారు. భారత పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడొద్దని పాక్ కు తేల్చి చెప్పారు. భారత భూభాగంలోకి డ్రోన్లు అనుమతించమని ఇండియా తేల్చి చెప్పింది. తొలి రౌండ్ చర్చలు దాదాపు గంటసేపు సాగాయి.
ఆపరేషన్ సిందూర్ తర్వాత రెండు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించిన 2 రోజులకు భారత్ పాక్ డైరక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ( DGMO) స్థాయి చర్చలు సోమవారం సాయంత్రం జరిగాయి. ముందుగా డీజీఎంవోలు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరిపించాల్సి ఉండగా అది కాస్త వాయిదా పడింది. చర్చల టైంలో పాకిస్థాన్ బాడీ లాంగ్వేజ్ రక్షణాత్మకంగానే ఉందని అన్నారు. మరో సారి కాల్పుల విరమణను ఉల్లంఘించే అవకాశం లేదని వర్గాలు తెలిపాయి. భూమి, వాయు, సముద్రంపై జరిగే అన్ని కాల్పులు, సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయడానికి ఒక అవగాహనకు వస్తున్నట్లు భారత్, పాకిస్తాన్ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.