రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు
న్యూస్ లైన్ డెస్క్: ప్రకృతి ఉగ్రరూపం దాలుస్తే దాని ముందు అందరం తలవంచాల్సిందే. కానీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఆ భీభత్సం నుండి చాలా వరకు ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. ప్రజలకు జరిగే తీవ్ర అసౌకర్యాన్ని తగ్గించ వచ్చు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక గొప్ప సైంటిస్టుతో సహా 16 మంది ప్రాణాలు కోల్పోయారని, దీనికి కాంగ్రెస్ సర్కార్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆగస్టు 31 నాడే తెలంగాణ వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ ఇచ్చిందని, ఆరంజ్ అలర్ట్ అంటే అధికార యంత్రాంగం అర్జంటుగా ఏం చేయాలో స్పష్టంగా ఆ శాఖ చెబుతూంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలో, ట్రాఫిక్ ను ఎలా రెగ్యులేట్ చేయాలో, పవర్ ఇవన్నీ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ మానువల్ లో ఉంటాయి. కానీ రాష్ట్రంలో ఇవేమీ జరిగినట్లు లేదని, ప్రకృతి విపత్తు, పునరావాస శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉందన్నారు.
ఆరంజ్ అలర్ట్ తరువాత ఆగస్టు 31 నాడు సీఎం రేవంత్ హైదరాబాద్‌లో అత్యవసర ప్రత్యేక సమీక్ష ఏమైనా తీసుకున్నరా? వారిచ్చిన ఆదేశాలు ఏమిటి? సీఎంవో మీటింగ్ లగ్ బుక్ ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాల మంత్రులకు సీయం హుకుం ఏంటి? వాటి వివరాలను ప్రజల ముందు ఉంచాలని సీఎస్, డీజీపి ఏమైనా వీడియో కాన్ఫరెన్సు తీసుకున్నారా అని ప్రవీణ్ కుమార్ నిలదీశారు. ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలకు ఏమైనా రిక్వెస్టు పెట్టారా? ఎన్ని రెస్క్యూ టీంలను తయారు చేసి ఎక్కడెక్కడ డ్యూటీలో ఉంచారు. హెలికాప్టర్ కావాలని ఏ సంస్థనైనా అడిగిండ్రా? వాటి వివరాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, స్పెషల్ పోలీసు బలగాలను ఏమైనా మొబిలైజ్ చేసిండ్రా? చేస్తే ఎక్కడెక్కడ పంపించారు. వారి మొబిలైజేషన్ వివరాలను ఇవ్వాలన్నారు. జిల్లా యంత్రాంగానికి అదనపు బడ్జెట్ ఇచ్చి ముందస్తు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిండ్రా? ఇస్తే కలెక్టర్లకు ఎప్పుడు ఆదేశాలు పంపించిండ్రు? దాని తాలూకు జీవో వివరాలను బయట పెట్టాలని ప్రవీణ్ కుమార్ అన్నారు.
ఆగస్టు 31, సెప్టెంబర్ 1 నాడు జిల్లాల మంత్రులు ఎక్కడున్నారు? వారు జిల్లా రెవెన్యూ పోలీసు యంత్రాంగాలతో మీటింగులు పెట్టి ఏం ఆదేశాలిచ్చారా? దయచేసి ఆ మీటింగ్ మినిట్స్ వివరాలు ప్రజల ముందు ఉంచాలన్నారు. కేసీఆర్ అయితే విపత్తు హెచ్చరిక వచ్చిన వెంటనే మంత్రులను ఎమ్మెల్యేలను అధికారులను పరిగెత్తించేవారని ప్రాణాలు కాపాడేవారు అని ఆయన గుర్తు చేశారు. మీరేమో కీలక సమయంలో హైడ్రా చూట్టూ హైడ్రామాలు చేస్తూ.. కేసీఆర్‌ని దూషిస్తూ అంతా అయిన తరువాత ఫోటోల కోసం మాత్రం పోలీసు బందోబస్తుతో నీళ్లలో మునిగిన ప్రజల మీద లాఠీచార్జీ చేస్తూ పరిగెత్తుతున్నారని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.