Bihar : నితీశ్ కు హ్యాండిచ్చిన మోదీ.. నెక్ట్స్ చంద్రబాబేనా?

ఎన్డీఏ మిత్రపక్షమైన ఆర్జేడీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హ్యాండిచ్చింది. ఎన్నికల సమయంలో ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ బిహార్ అడుగుతున్న ప్రత్యేక హోదాకు నో చెప్పింది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-22/1721647170_ModiNitish.jpg

న్యూస్ లైన్ డెస్క్ : మిత్రపక్షాల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించిన బీజేపీ జేడీయూకి మొండిచెయ్యి చూపించింది. ఎన్నికల్లో జేడీయూ మద్దతు తీసుకున్న బీజేపీ లోక్ సభలో బిహార్ కి హ్యాండిచ్చింది. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని లోక్ సభలో స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు జాతీయ అభివృద్ధి మండలి – ఎన్డీసీ ఐదు నిబంధనలు పెట్టిందని.. వాటి ప్రకారం బిహార్ కి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. ఆ ఐదు నిబంధనల ప్రకారమే గతంలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది. బిహార్ కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై అధ్యయనం చేసిన నివేదిక 2012 మార్చి 30న కేంద్ర ప్రభుత్వానికి అందిందని కేంద్రం తెలిపింది.

ఈరోజు ప్రారంభమైన లోక్ సభ సమావేశాల్లో జేడీయూ సభ్యుడు రామ్ ప్రీత్ మండల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ఉన్న జేడీయూకి ఇది పెద్ద షాకే. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటై నెల గడవగానే.. మోడీ సర్కార్ నుంచి తొలి షాక్ జేడీయూకే తాకిందని పలువురు రాజకీయ వేత్తలు కామెంట్ చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రత్యేక హోదాపై ఒత్తిడి తెచ్చి సానుకూల స్పందన వచ్చేలా చేయాలన్నది జేడీయూ ఆలోచన. కానీ.. కేంద్రం నితీశ్ కుమార్ ఆశలపై నీళ్లు చల్లింది.

జేడీయూ ప్రధాన డిమాండ్ అయిన ప్రత్యేక హోదాను కేంద్రం బుట్టదాఖలుచేయడంతో నితీశ్ కూటమి నుంచి తప్పుకుంటాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ సైతం ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రాన్ని చాలాసార్లు ప్రశ్నించాయి. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాగా.. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండటంతో ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమే అనే ధోరణి కనిపించింది. అయితే.. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ జేడీయూకి ప్రత్యేక హోదా విషయంలో నో చెప్పడంతో నెక్స్ట్ టీడీపీకి కూడా నో చెప్పే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే.. ఇదే సరైన సమయం అని.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టాలని ‘ఏపీ ప్రత్యేక హోదా సాధన కమిటీ’ అభిప్రాయ పడుతోంది.

 

newsline-whatsapp-channel
Tags : ap-news chandrababu bihar bjp narendra-modi latest-news

Related Articles