లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.32.07 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
న్యూస్ లైన్ డెస్క్: లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.32.07 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2014 నుంచి మోడీ సర్కారుకు ఇది 13వ బడ్జెట్ కాగా ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ ఏడోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2047 కల్లా వికసిత్ భారత్ అనే లక్ష్యానికి తగినట్లు బడ్జెట్ ను రూపకల్పన చేశారు. ఇక ఈ బడ్జెట్‌లో విద్య, నైపుణ్యాభివృద్ధికి కేంద్ర రూ.లక్షా 48 వేల కోట్లు కేటాయించింది. ఇక గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు, మహిళాభివృద్ధికి రూ.3 లక్షల కోట్లు, అర్బన్ హౌసింగ్ కోసం రూ.2.2 లక్షల కోట్లు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు కేటాయించింది. వ్యవసాయంలో ఉత్పాదకత పెంచడం, ఉద్యోగం, నైపుణ్యాలు పెంచడం, మానవ వనరుల అభివృద్ధి-సామజిక న్యాయం, తయారీరంగం, సేవలు, పట్టణాల అభివృద్ధ, ఇంధన భద్రత, మౌలిక వసతుల అభివృద్ధి, ఆవిష్కరణలు, పరిశోధన-అభివృద్ధ, కొత్తతరం సంస్కరణలు తమ ప్రభుత్వం ప్రాధ్యానత ఇస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.