ఆ తర్వాత టూరిస్ట్ లోని చిన్నారులు, మహిళలను వదిలిపెట్టి వారి కళ్లముందే మగవారిని కాల్చి చంపేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : జమ్ముూ కశ్మీర్ పహల్గాంలోని బ్యూటిఫుల్ ప్లేస్ అయినా బైనరస్ ప్రాంతంలో టూరిస్ట్ లపై మంగళవారం మధ్యాహ్నం 3 గంటల టైంలో ఉగ్రవాదులు దాడికి తెబడిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు మరణించారు. ఉగ్రవాదుల్లో కొందరు మిలటరీ డ్రెస్సుల్లో వచ్చారని మరికొంతమంది మామూలు బట్టలు వేసుకొని బైసరన్ ప్రాంతంలోకి వచ్చారు. ఆ తర్వాత టూరిస్ట్ లోని చిన్నారులు, మహిళలను వదిలిపెట్టి వారి కళ్లముందే మగవారిని కాల్చి చంపేశారు.
ఉగ్రదాడి సమాచారంతో వెంటనే సైన్యం ఆపరేషన్ చేపట్టింది. టెర్రరిస్ట్ లను గుర్తించే పనిలో పడ్డారు. ముగ్గురు టెర్రరిస్టుల ఊహాచిత్రాలను దర్యాప్తు బృందాలు రిలీజ్ చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజి , సులేమాన్ షా, అబుతాలాగా గుర్తించారు. మూసా , యూనిస్ , ఆఫీఫ్ అనే కోడ్ నేమ్స్ ఉన్నట్లు గుర్తించారు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అలియాస్ ఖలీద్ అని కూడా పిలువబడే సైఫుల్లా కసూరి ఈ దాడికి మెయిన్ లీడ్ గా నిఘా సంస్థలు గుర్తించాయి.
సైఫుల్లా ఖలీద్ పాకిస్థాన్ లోని గుజ్రన్ వాలా నగరం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. పాక్ ఐఎస్ఐ, ఆర్మీ ఉన్నతాధికారులతో సైఫుల్లాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పాకిస్థాన్ మాత్రం మాకు సంబంధం లేదనే స్టేట్మెంట్ ఇచ్చింది.పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ఉన్న మరో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఈ దాడిలో ప్రధాన వ్యక్తులుగా ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.