ప్రస్తుత కాలంలో మార్కెట్లోకి అనేక రకాల ఎలక్ట్రికల్ వాహనాలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థలకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నాయి. ఎందుకంటే
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో మార్కెట్లోకి అనేక రకాల ఎలక్ట్రికల్ వాహనాలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థలకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నాయి. ఎందుకంటే డీజిల్, పెట్రోల్ వాహనాల వల్ల వాతావరణము ఎక్కువగా కలిషిత మవుతుందని ఎలక్ట్రికల్ స్కూటర్ల వల్ల ఈ ప్రమాదం తప్పుతుందని ఆలోచనతో ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రికల్ స్కూటర్లు తయారీ కంపెనీలకు ప్రోత్సాహం అందించి ఈ స్కూటర్ల వాడకాలని పెంచే విధంగా ఆలోచన చేస్తున్నాయి.
దీంతో మార్కెట్లోకి చాలా కంపెనీలు ఎలక్ట్రికల్ వాహనాలను అందిస్తున్నాయి. అలా ఎలక్ట్రికల్ వాహనాల కంపెనీలో మంచి గుర్తింపు పొందినటువంటి కంపెనీ గోదావరి ఎలక్ట్రికల్ మోటార్స్. ఈ కంపెనీ నుంచి ఈ EBLU FEO X పేరుతో ఈ స్కూటర్ లాంచ్ చేసింది. మరి ఈ స్కూటర్ యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలు చూద్దాం. ఈ యొక్క ఎలక్ట్రికల్ స్కూటర్ 1850 MM, 1140MM ఎత్తు, 1345 MM వీల్ బేస్, 170MM గ్రౌండ్ క్లియరెన్స్ కొలతలను కలిగి ఉంది. అలాంటి ఈ స్కూటర్ ను ఒక్కసారి చార్జ్ చేస్తే 110 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణం చేస్తుంది.
అంతేకాకుండా ఈ స్కూటర్ లో ఏహెచ్ఓ ఎల్ఈడి హెడ్లైట్లు, సెన్సార్ ఇండికేటర్ తో సైడ్ స్టాండ్, సిబిఎస్ డిస్క్ బ్రేక్ సిస్టం, 12inch రీప్లేస్ చేయగలిగే ట్యూబ్ లెస్ టైర్లు ఇందులో ఉంటాయి. అంతేకాకుండా ఈ వాహనంలో ఎర్గోనామిక్ సీటింగ్, నావిగేషన్ కోసం బ్లూటూత్ టెక్నాలజీ, అలాగే ఇన్ కమింగ్ మెసేజ్ అలర్ట్ లు, రివర్స్ ఇండికేటర్, తొరేటల్ పాల్ట్ సెన్సార్, బ్యాటరీ అలర్ట్, హెల్మెట్ కోసం నావిగేషన్ అసిస్టెంట్ తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 7.4 ఇంచ్ డిజిటల్ ఫుల్ కలర్ డిస్ప్లే కలిగి ఉంటుంది. గోదావరి కంపెనీ ఈ స్కూటర్ పై అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. కేవలం రూ:99,999 ఈ స్కూటర్ మనకు అందుబాటులోకి తీసుకువచ్చింది.