Woman Journalist: మహిళా జర్నలిస్టుపైకి కుక్కలను వదిలిన ఒడిశా మాజీ మంత్రి 2024-06-26 14:14:37

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : చాలా మందికి మీడియా అంటే మంట....ప్రశ్నిస్తామని...వాళ్లు చెప్పే తింగరి ఆన్సర్లకి ...పాయింట్లు లాగుతామని...తప్పదు కదా... ప్రజలకు..ప్రభుత్వానికి ఎలా అయితే  ప్రజాప్రతినిధులున్నారో...ప్రజాప్రతినిధులకు ప్రజలకు మధ్య మీడియా ఉంటుంది. మీ ప్రశ్నలకు మీడియా గొంతులా పనిచేస్తుంది. కాస్త అతిగా ఉందని మీకు అనిపించినా ...ప్రాణాలు రిస్క్ చేసి ప్రతి సమాచారం అందిస్తాం అలాంటి వారిపై మరీ కఠినంగా ప్రవర్తిస్తే ఎలా ..ఓ మహిళా జర్నలిస్టుపై  ఒడిస్సా మాజీ మంత్రి రఘునందన్ ( raghu nandan) దాస్ తన పెంపుడు కుక్కలను వదిలిపెట్టాడు. అడగకూడనిది అడిగినా ...మీడియాపై ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఆయన చేసిన పనికి మీడియా ప్రతినిధులకు , కెమరామ్యాన్ కు గాయాలయ్యాయి. ఈ చర్యపై ఆ జర్నలిస్ట్ కేసు కూడా పెట్టింది.


బాబీ దాస్( bobby das)  గా పిలుచుకునే మాజీ ఎమ్మెల్యే ప్రణబ్ ప్రకాశ్ దాస్ ( pranab prakash raj) అధికారిక నివాసంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత గురించి ప్రశ్నించినందుకే ఈ సంఘటన జరిగింది.  బీజేడీ నేత బాబీ దాస్ 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో అతడికి ప్రభుత్వం భువనేశ్వర్ లో అధికారిక క్వార్టర్స్ కేటాయించింది. ప్రభుత్వం కేటాయించిన బిల్డింగ్ తో పాటు పక్కనే ఉన్న మరో మూడు క్వార్టర్లను కూడా బాబీ దాస్ ఆక్రమించారు. వాటన్నింటిని కలిపి నాలుగు అంతస్థుల ప్రైవేట్ బిల్డింగ్ ను నిర్మించుకున్నారు. ఎన్నికల్లో ఎప్పుడైతే ఓడిపోయారో వెంటనే అధికార పార్టీ బిల్డింగ్ ఖాళీ చేయాల్సి వచ్చింది. అక్రమంగా కట్టినవి వెలుగులోకి రాకముందే కూల్చేయడానికి రెడీ చేస్తున్నారు.
అది ప్రశ్నించిన మహిళా జర్నలిస్ట్( lady jurnalist) పై బాబీదాస్ కుక్కను వదిలారు. . ఈ ఘటనపై జర్నలిస్టుల ఫిర్యాదుతో రఘునందన్ దాస్ ( raghunandan das) పై పోలీసులు కేసు నమోదు చేశారు.