Watch: అన్న కు రాఖీ కట్టి...కన్నుమూసిన చెల్లెలు

ఓ యువతి తన సోదరులకు రాఖీ కట్టి కన్నుమూసింది. ఈ ఘటన ఇక ఆ అన్నదమ్ముల మనసులో ఎంత బాధను మిగిల్చిందో ఊహకు కూడా అందదు.


Published Aug 19, 2024 04:14:00 PM
postImages/2024-08-19/1724064313_rakhi51723985841.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రాఖీ పండుగ అంటే రక్తసంబంధం. అసలు అన్నతమ్ములను తనకు తోడుగా నీడగా ఉండాలని కోరుతూ రాఖీ కడతారు. ఇలాంటి పండుగ  రోజు ఓ యువతి తన సోదరులకు రాఖీ కట్టి కన్నుమూసింది. ఈ ఘటన ఇక ఆ అన్నదమ్ముల మనసులో ఎంత బాధను మిగిల్చిందో ఊహకు కూడా అందదు. ఈ ఘటన స్థానికులతో పాటు విషయం తెలిసిన ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించింది. 


మహబూబ్ నగర్ జిల్లాలోని నర్సింహులపేట మండలం కోదాడలో డిప్లొమా చదువుతున్న ఓ యువతి ప్రేమ పేరుతో ఓ ఆకతాయి వేధిస్తుండటంతో మనస్తాపం చెంది గడ్డిమందు తాగి ఆత్మ హత్యాయత్నం చేసింది. అయితే తను ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న టైంలో కుుటంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్తే కొనఊపిరితో ఉంటూ తన అన్నయ్యకు రాఖీ కట్టింది . రాఖీ కట్టిన అరగంటకు అమ్మాయి చనిపోయింది.


కళ్ల ముందే తమ కూతురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తోడబుట్టిన వారి రోదనలు మిన్నంటాయి. ఇదంతా వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.నెటిజన్లను సైతం కన్నీరు పెట్టిస్తోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu rakhi sucide

Related Articles