రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని తుమ్మల చెప్పారు. ఆగస్టు 15 లోగా ఎందుకు రుణమాఫీ చేయలేకపోయారు.. నేను విసిరిన ఛాలెంజ్ అదే అని తెలిపారు. ఢిల్లీలో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ అంటేనే కూల్చివేతల సర్కార్ అని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో చిట్‌చాట్ చేస్తూ ఓల్డ్ సిటీ విద్యుత్ బకాయిలను ఆదానీకి అప్పగిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో అడిగితే మేమెక్కడ అన్నామని అంటున్నారు. అబద్ధాలను, గోబెల్స్‌ను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హరీష్ రావు హెచ్చరించారు. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గజదొంగ అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మంత్రులు,ఎమ్మెల్యేలు రుణమాఫీ జరగలేదని అంటున్నారని గుర్తుచేశారు.
రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని తుమ్మల చెప్పారు. ఆగస్టు 15 లోగా ఎందుకు రుణమాఫీ చేయలేకపోయారు.. నేను విసిరిన ఛాలెంజ్ అదే అని తెలిపారు. ఢిల్లీలో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ ఎప్పుడు హైదరాబాద్ వస్తారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లి రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకుని సీఎం స్వంత గ్రామంలో రుణమాఫీ అయిందో లేదో చెప్పడానికి తీసుకువెళ్తా అని ఆయన వెల్లడించారు. వరంగల్ సభకు రాహుల్ గాంధీని మూడు సార్లు రేవంత్ రెడ్డి పిలిచినా రావడం లేదని ఆయన ప్రశ్నించారు.
వాల్మీకి స్కాం పట్టపగలు నిలువు దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ డబ్బుతో కార్లు, బంగారం కొన్నారని వెల్లడించారు. తెలంగాణకు చెందిన తొమ్మిది కంపెనీల అకౌంట్స్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని హరీష్ రావు కుండబద్దలు కొట్టారు. వాల్మీకి స్కాంపై కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. వాల్మీకి స్కాం డబ్బులు ఎవరికి వచ్చాయో నేను, రేవంత్ రెడ్డి వెళ్లి ఈడీ విచారణకు కోరుతాము దానికి రేవంత్ రెడ్డి సిద్ధమా? అని అడిగారు. వాల్మీకీ స్కాంపై ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా అని నిలదీశారు. వాల్మీకి స్కాంపై తెలంగాణలో ఈడీ విచారణ ఎందుకు జరగడం లేదు. రాహుల్ గాంధీ దీనిపై ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కూల్చివేతల సర్కార్ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బ్రాండ్‌ను కూల్చివేశారని మండిపడ్డారు. కేసీఆర్ కిట్, రైతుబంధు, రాష్ట్రంలో వైద్య వ్యవస్థ, దేవుళ్ళపై ఒట్టు వేసి ప్రజల విశ్వాసాలను, గొర్రెల కాపర్ల ఉపాధిని కూల్చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. GHMC ఆఫీసు నాలా కింద ఉంది.. దాన్ని కూలగొడతారా? అని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్ పక్కన ఉన్న రెస్టారెంట్స్, ఇతర వాణిజ్య భవనాలను కూలగొడతారా అని అడిగారు. మీరాలం, ఉప్పల్, రామంతాపూర్ చెరువుల్లో పెద్ద, పెద్ద టవర్లు వచ్చాయి. పొంగులేటి ఇంట్లో నీళ్లు చెరువులోకి వెళ్తున్నాయా.. ఎక్కడికి వెళ్తున్నాయని ఆయన ప్రశ్నించారు. పొంగులేటి ఇంటికి ఏమైనా స్పెషల్‌గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉందా? అని హరీష్ రావు ఎద్దేవా చేశారు.