Consumer Forum: ట్రైన్ లో లగేజీ పోతే..రైల్వేశాఖదే బాధ్యత 2024-06-25 15:13:36

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రైలులో(TRAIN)  సామాను పోయిందా...చాలా వరకు ఆ సామాను రాములోరి ఖాతాలోకి వెళ్లినట్టే. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా దొరకదు...మన అదృష్టం బాగుండి...సామాను దొరికినా ..అందులో అన్నీ ఉండవు.  అయితే రైలులో సామాను పోగొట్టుకొని ...తిరిగి రైల్వే శాఖే ( RAILWAY) లక్ష పరిహారం చెల్లించాలని తీర్పు నిచ్చింది వినియోగదారుల కమిషన్.


2016 లో జరిగిన చోరీ కేసులో తాజాగా తీర్పు వెలువరించింది. పరిహారం మొత్తాన్ని చెల్లించాలని సంబంధిత జనరల్ మేనేజర్ ( GENRAL MANAGER) ను ఆదేశించింది. అసలు ఏం జరిగిందంటే.. 2016లో ఢిల్లీకి చెందిన ఓ మహిళ మాల్వా ఎక్స్ ప్రెస్ ( MALWA EXPRESS) లో ఢిల్లీ ( DELHI) నుంచి ఇండోర్ కు ప్రయాణించారు. ఈ ప్రయాణంలో తన వెంట తీసుకెళ్లిన విలువైన బ్యాగు చోరీకి గురైంది. ఝాన్సీ( JHANSI) , గ్వాలియర్ ( GWALIYAR) స్టేషన్ల మధ్య ఈ దొంగతనం జరిగినట్లు గుర్తించిన మహిళ.. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ బ్యాగులో 80 వేల రూపాయిలు విలువ చేసే వస్తువులున్నాయని కంప్లైంట్ చేశారు. ఇది రైల్వే పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించింది.


అయితే, ప్రయాణ సమయంలో ఆమె నిర్లక్ష్యం వల్లే బ్యాగు చోరీకి గురైందని, లగేజీ కోసం ప్రత్యేకంగా ఎటువంటి బుకింగ్‌ చేసుకోలేదని రైల్వేశాఖ వాదించింది. ఇరువురి వాదనలు విన్న కమిషన్.. రైల్వే శాఖ వాదనను తోసిపుచ్చింది. ఈ కేసులో రైల్వే శాఖ( RAILWAY)  నిర్లక్ష్యం, సేవా లోపం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. దీనికి పరిహారంగా 1.8 లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చింది.