Jagannath Rath Yatra: నేడు పూరీ జగన్నాథుడి రథయాత్ర !

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథుడి రథయాత్ర అంగరంగవైభవంగా జరుగుతుంది . ఒరిస్సా అంతా మరో సంక్రాంతి జరుగుతుంది.నేటి రథయాత్రకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. 1971 తర్వాత తొలిసారి ఒకేరోజు జగన్నాథ నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహించనున్నారు. జగన్నాథ, బలభద్రస్వామి, సుభద్ర శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనాన్ని వీడి పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి యాత్రగా చేరుకున్నారు.


Published Jul 07, 2024 05:41:00 PM
postImages/2024-07-07/1720354277_jagannathrath600261498447992.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథుడి రథయాత్ర అంగరంగవైభవంగా జరుగుతుంది . ఒరిస్సా అంతా మరో సంక్రాంతి జరుగుతుంది.నేటి రథయాత్రకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. 1971 తర్వాత తొలిసారి ఒకేరోజు జగన్నాథ నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహించనున్నారు. జగన్నాథ, బలభద్రస్వామి, సుభద్ర శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనాన్ని వీడి పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి యాత్రగా చేరుకున్నారు.


ఈ రథయాత్రకు మరో ప్రత్యేకత కూడా ఉంది. పూరీజగన్నాథుడి రథయాత్రలో తొలిసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటున్నారు. గతంలో రాష్ట్రపతులు ఎవరూ ఈ యాత్రకు హాజరు కాలేదు. గవర్నర్ రఘుబర్‌దాస్‌తో కలిసి సుభద్రమ్మ రథాన్ని రాష్ట్రపతి లాగుతారు. 


నిజానికి  ఈ మూడు వేడుకలు వేరు వేరు గా జరుగుతుంటాయి. మూడు వేడుకలు నేడు  నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదళన్ రథాలు నేటి సాయంత్రానికి అమ్మవారి ఆలయానికి  వెతుక్కుంటారు. లేదు. స్వామి సేవలు పూర్తయ్యే వరకు రథాలను మార్గమధ్యంలో నిలిపివేస్తారు. ఇక ఆ రథాలు తిరిగి రేపే మళ్లీ మొదలవుతాయి.
ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి, కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు కూడా రథోత్సవంలో పాల్గొంటారు. రెండు రోజులపాటు జరిగే ఈ రథోత్సవంలో దాదాపు 15 లక్షల మందికి పైగా హాజరయ్యారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu

Related Articles