SP Balasubrahmanyam: చెన్నైలో ఓ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై నగరంలో ఓ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రమణ్యం పేరు పెట్టారు.


Published Sep 25, 2024 10:02:00 PM
postImages/2024-09-25/1727281970_SPBB2.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : గానగంధర్వుడు , వేల పాటలకు గానం అందించిన ఎస్పీబాలసుబ్రమణ్యం అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. అటు కన్నడ ఇటు తెలుగు , తమిళ్ ఇలా ఇండస్ట్రీల వారికి బాలసుబ్రమణ్యం టాప్ సింగర్. వేల పాటలు..వేల రాగాలు ఆయన కీర్తిని గుర్తు చేసుకుంటూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై నగరంలో ఓ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రమణ్యం పేరు పెట్టారు.


ఎస్పీ బాలు చెన్నైలో నుంగంబాక్కం ఏరియాలో నివసించేవారు. ఇప్పుడు నుంగంబాక్కంలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు బాలు పేరు పెట్టారు. కాందార్ నగర్ మెయిన్ రోడ్డును ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా పిలవనున్నారు. దీనిపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.  ఇది ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి చాలా విలువైన గౌరవ సూచిక అని తెలిపింది.


 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు కూడా అందుకున్నారు. కేంద్రం ఆయనకు 2001లో పద్మ శ్రీ, 2011లో పద్మ భూషణ్, 2021లో పద్మ విభూషణ్ అందించింది. బాలు గారు ఇక పై తమిళనాడు లో చాలా మంది నోట తిరిగి బ్రతుకుతారంటున్నారు ఆయన ఫ్యాన్స్.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tamilnadu

Related Articles