NTR 31: ఎన్టీఆర్‌- నీల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 9న గ్రాండ్ థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు మూవీయూనిట్ తెలుపుతూ ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.


Published Aug 09, 2024 04:09:28 AM
postImages/2024-08-09/1723194535_ntr31.PNG

న్యూస్ లైన్ సినిమా: టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘‘దేవర’’. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హరోయిన్‌గా నటిస్తోంది. ఇక బాలీవుడ్‍లో హృతిక్ రోషన్‍తో కలిసి ఎన్టీఆర్ వార్-2 మూవీలో కూడా నటిస్తున్నారు. కేజీఎఫ్, సలార్ సినిమాల బ్లాక్‍బస్టర్లతో జోష్ మీద ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారు. శుక్రవారం ఈ మూవీని అధికారికంగా లాంచ్ చేశారు.

ఎన్టీఆర్- నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్ 31' సినిమా ఓపెనింగ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా, ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 9న గ్రాండ్ థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు మూవీయూనిట్ తెలుపుతూ ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : jr-ntr tollywood movie-news devara

Related Articles