ఈ భేటీ లో సీఎం నుంచి అనుమతి తీసుకొని పెంచిన ఛార్జీలను అమల్లోని తీసుకొచ్చేందుకు మెట్రో యాజమాన్యం సిద్ధమైంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మైట్రో రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ అనౌన్స్ చేసింది. ఈ నెల 10వ తారీఖు నుంచి మెట్రో ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే రెండేళ్ల క్రితం కేంద్రప్రభుత్వం నియమించిన ఛార్జీల నిర్ణయ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఛార్జీలను పెంచనున్నారు. అయితే ఈ నెల 8 వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మెట్రో అధికారులు భేటీ కానున్నారు. ఈ భేటీ లో సీఎం నుంచి అనుమతి తీసుకొని పెంచిన ఛార్జీలను అమల్లోని తీసుకొచ్చేందుకు మెట్రో యాజమాన్యం సిద్ధమైంది.
కోవిడ్ నుంచి మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో మెట్రోపై ఆర్ధిక భారం ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ భారం కూడా దాదాపు రూ.6,598కోట్లకు చేరినట్లు సమాచారం. అయితే ఇన్నాళ్లు మెట్రో ఛార్జీలు పెంచాతమంటూ చాలా రోజుల నుంచి చెబుతూనే ఉంది. హైదరాబాద్ మెట్రోలో ప్రస్తుతం రోజుకు 1200 సర్వీసులు నడుస్తుండగా.. 4.80లక్షల మంది ప్రయాణిస్తున్నారు. శని, ఆదివారాల్లో, సెలవు రోజుల్లో 5.10లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ప్రస్తుతం చార్జీల కంటే 25 నుంచి 30శాతం పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. అయితే ఇప్పుడు ఛార్జీలు ఎంత పెరుగుతున్నాయంటే ..
* 8 నుంచి 10 కిలో మీటర్లకు ప్రస్తుతం ఛార్జీ రూ. 35 ఉంది. రూ. 45కు పెరిగే అవకాశం.
* 10 నుంచి 14 కిలో మీటర్లకు ప్రస్తుతం ఛార్జీ రూ. 40 ఉంది. రూ. 55కు పెరిగే అవకాశం.
* 14నుంచి 18 కిలో మీటర్లకు ప్రస్తుతం ఛార్జీ రూ. 45 ఉంది. రూ. 60కు పెరిగే అవకాశం.
* 18 నుంచి 22 కిలో మీటర్లకు ప్రస్తుతం ఛార్జీ రూ. 50 ఉంది. రూ. 65కు పెరిగే అవకాశం.
* 22 నుంచి 26 కిలో మీటర్లకు ప్రస్తుతం ఛార్జీ రూ.55 ఉంది. రూ. 70కు పెరిగే అవకాశం.
* 26 కిలో మీటర్లకుపైన ప్రస్తుతం ఛార్జీ రూ. 60 ఉంది. రూ. 75కు పెరిగే అవకాశం.