MAHARASTRA: జుంబా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి

మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ లో ఓ జిమ్ లో జుంబా డ్యాన్స్ చేస్తున్న వ్యాపారవేత్త గుండెపోటుతో మరణించాడు. మృతుడు సిమ్రాన్ మోటర్ యజమాని కవల్జిత్ సింగ్ అని గుర్తించారు.


Published Jul 22, 2024 06:00:00 PM
postImages/2024-07-22/1721651539_Screenshot20240722112002781c337646f29875672b5a61192b9010f9.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ లో ఓ జిమ్ లో జుంబా డ్యాన్స్ చేస్తున్న వ్యాపారవేత్త గుండెపోటుతో మరణించాడు. మృతుడు సిమ్రాన్ మోటర్ యజమాని కవల్జిత్ సింగ్ అని గుర్తించారు. బాగా వ్యాయామం చేస్తున్నపుడు కళ్లు తిరుగుతున్నట్లుగా కవల్జిత్ పక్కకు వెళ్లిపోయారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ పుటేజీ లో రికార్డు అయ్యింది. కవల్జిత్ కు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండగా..పక్కకు వెళ్లి నేల పై కుప్పకూలిపోయాడు. వెంటనే పక్కనున్న వారు ..రెస్పాండ్ అయినా ఫలితం లేకుండా పోయింది. అయితే దగ్గర్లో ఉన్న హాస్పటిల్ కు తరలించినా ...ఫలితం లేదని ఆయన చనిపోయినట్లు డాక్టర్లు డిక్లర్ చేశారని జిమ్ యాజమాన్యం తెలిపారు. చాలా హెల్దీ లైఫ్ స్టైల్ అని ..రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారని అయినా ఇలా జరగడం జరగడం బాధాకరమంటున్నారు అతని ఫ్రెండ్స్. 

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business mumbai

Related Articles