Mysterious illness: ఆ ఊరిలో మిస్టరీ వ్యాధి - కాళ్లు చేతులు వాపులు

కర్ణాటకలోని చిక్కమంగుళూరు తెలిసిందే కదా. ప్రకృతి అందాలతో ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే ఇప్పుడు అక్కడి ప్రజలు వింత వ్యాధితో బాధపడుతున్నారు.ప్రజలు కాళ్లు వాచి, ఒళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షలకు కూడా ఆ వ్యాధి ఏమిటనేది అంతు చిక్కడం లేదు. ఎలా ఈ వ్యాధి వస్తుందనేది అర్ధం కావడం లేదట.


Published Jul 15, 2024 08:10:00 PM
postImages/2024-07-15/1721054521_163618crvqtaqqnp1630658920.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కర్ణాటకలోని చిక్కమంగుళూరు తెలిసిందే కదా. ప్రకృతి అందాలతో ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే ఇప్పుడు అక్కడి ప్రజలు వింత వ్యాధితో బాధపడుతున్నారు.ప్రజలు కాళ్లు వాచి, ఒళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షలకు కూడా ఆ వ్యాధి ఏమిటనేది అంతు చిక్కడం లేదు. ఎలా ఈ వ్యాధి వస్తుందనేది అర్ధం కావడం లేదట.


చిక్కమగళూరు జిల్లాలోని దేవగొండనహళ్లి గ్రామంలో ...చాలామంది జ్వరం, కీళ్ల నొప్పులతో  బాధపడుతున్నారు. మరోవైపు ఆ గ్రామంలో డెంగ్యూ, చికున్ గున్యా సమస్యలు కూడా భయపెడుతున్నాయి. అయితే రెండు లక్షణాలున్నా...వ్యాధి మాత్రం వింతగా ఉందన్నారు డాక్టర్లు.  ఈ మిస్టరీ వ్యాధి సోకినవారి ఎవరిలో డెంగ్యూ, చికున్ గున్యా లక్షణాలేవీ కనిపించడం లేదని ..ఈ బ్లడ్ సాంపిల్స్ ఢిల్లీ పంపుతామని అంటున్నారు.


వీరిలో కొందరికి రక్త పరీక్షలు నిర్వహించగా వైరల్ ఫీవర్ అని తేలింది. గ్రామంలో 400 కుటుంబాలు ఉండగా.. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఈ అనారోగ్యానికి గురవ్వుతున్నారు. చేతి వేళ్లు కూడా తీవ్రంగా నొప్పి పుడుతున్నాయని, దానివల్ల భోజనం చెయ్యడం కూడా కష్టంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో ఢిల్లీ నుంచి రిపోర్టులు వస్తాయని అప్పుడే గ్రామస్థులకు వైద్యం చేయగలమని అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-problems

Related Articles