ఈ మేరకు మండిలో కేసు నమోదు చేసి, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కంగనాను అనర్హురాలిగా ప్రకటించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: సినీ నటి, మండి జేబీపీ ఎంపీ కంగనా రనౌత్‌కు హైకోర్టు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది.
మండి నుండి పోటీ చేసిన కిన్నౌర్ నివాసి లాయక్ రామ్ నేగి కంగనాపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తన నామినేషన్ పత్రాలను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. దీని వెనుక కంగనా హస్తం ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు మండిలో కేసు నమోదు చేసి, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కంగనాను అనర్హురాలిగా ప్రకటించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఆయన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆగస్టు 21లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కంగనాకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.