ఈ దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆ దేశం ప్రోత్సహిస్తుందనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.
న్యూస్ , స్పెషల్ డెస్క్ : భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై భారత్ చాలా గట్టి నిర్ణయం తీసుకుంది.పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ ఖాతాను భారత్‌లో నిలిపివేశారు. ఈ దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆ దేశం ప్రోత్సహిస్తుందనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమయింది. పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. నిన్న సాయంత్రం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియా సమాదవేశంలో మాట్లాడుతూ భారత్ తీసుకున్న పలు నిర్ణయాలను ప్రకటించారు. పాకిస్థాన్ తో దౌత్యసంబంధాలను తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఇరు దేశాల్లోని రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను తగ్గించనున్నట్లు తెలిపారు.ప్రస్తుతం ఉన్న 55 మంది సిబ్బందిని మే 1వ తేదీలోగా 30కి తగ్గిస్తున్నారు. దీనికి ఇరు దేశాలు ఒప్పుకున్నట్లు తెలిపారు.దౌత్యపరమైన చర్యలతో పాటు డిజిటల్ మాధ్యమంలో కూడా భారత్ తన నిరసనను వ్యక్తం చేసింది.