RAILWAY: తగ్గనున్న రైల్వే ప్లాట్ ఫారమ్ టికెట్టు ధర.!

ఇండియన్ రైల్వే( RAILWAY)  రోజు కొన్ని లక్షల మంది ప్రయాణికులు వాళ్లు వెళ్లాలనుకునే ప్లేస్ కి వెళ్తుంటారు. అయితే చాలా మందికి ఈ రైల్వే ఫ్లాట్ ఫారమ్ టికెట్ ( PLATFORM) ధర కాస్త ఇబ్బందికరంగా మారింది. అందుకే రైల్వేశాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పనుంది. ప్లాట్‌ఫారం టికెట్ ధర తగ్గించాలనుకుంటుంది రైల్వే.


Published Jun 27, 2024 07:24:00 PM
postImages/2024-06-27/1719496447_162746638148011.jpeg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇండియన్ రైల్వే( RAILWAY)  రోజు కొన్ని లక్షల మంది ప్రయాణికులు వాళ్లు వెళ్లాలనుకునే ప్లేస్ కి వెళ్తుంటారు. అయితే చాలా మందికి ఈ రైల్వే ఫ్లాట్ ఫారమ్ టికెట్ ( PLATFORM) ధర కాస్త ఇబ్బందికరంగా మారింది. అందుకే రైల్వేశాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పనుంది. ప్లాట్‌ఫారం టికెట్ ధర తగ్గించాలనుకుంటుంది రైల్వే.


ప్లాట్‌ఫారం టిక్కెట్ ( PLATFORM TICKET) లేకుండా ఎవరైనా స్టేషన్‌లోపలికి ప్రవేశిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ప్లాట్‌ఫారం టిక్కెట్ కూడా రైల్వేకు ( RAILWAY) ఆదాయాన్ని సమకూర్చే ​మార్గాలలో ఒకటి. ప్రస్తుతం ప్లాట్‌ఫారం టికెట్ ధర రూ.10. అయితే జూన్ 22న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్లాట్‌ఫారం టిక్కెట్లపై జీఎస్టీని తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. 


అయితే ఎక్కువ శాతం...ధర తగ్గించలేకపోయినా ...కాస్త ధర తగ్గిస్తామంటుంది. ప్లాట్‌ఫారం టికెట్‌తో పాటు రిటైరింగ్ రూమ్, బ్యాటరీతో నడిచే కారు ఇతర సేవల రుసుము( BILLS)  నుంచి కూడా జీఎస్టీని( GST)  తొలగించారు. దీంతో ఇప్పటి వరకూ 5 శాతం ఉన్న జీఎస్టీ భారం ‍ప్రయాణికులకు తగ్గనుంది. ఫలితంగా ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర రూ. 10 నుంచి రూ. 9కి చేరనుంది. అక్కడ బ్యాటరీతో నడిచే వెహికల్ ధర కూడా స్వల్పంగా తగ్గుతుందంటుంది రైల్వే.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu railwaystation platform-ticket price-drop

Related Articles