lakshmi dasa: పుష్ప-2 లో పీలింగ్స్ సాంగ్ పాడిన సింగర్ గురించి తెలుసా !

చంద్రబోస్ రాసిన ఈ పాటను శంకర్ బాబుతో కలిసి ఆమె పాడారు నిన్నాడేమన్నంటినా తిరుపతి పాటను కూడా ఈ అమ్మాయి పాడింది.


Published Dec 07, 2024 04:39:00 PM
postImages/2024-12-07/1733569837_386251laxmidasa.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పుష్ఫ-2 సినిమాలో పీలింగ్స్ పాట తెలుసుగా...అసలు మాంచి పెళ్లి భరాత్ సాంగ్ ...ఊపున్న సాంగ్ తో పాటు ..పిచ్చి పిచ్చ క్రేజీగా వైరల్ అవుతున్న సాంగ్ అయితే పాడిన సింగర్ గురించి తెలుసుకుందాం. ఫీలింగ్స్ పాటను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన లక్ష్మీ దాస అనే అమ్మాయి పాడింది. చంద్రబోస్ రాసిన ఈ పాటను శంకర్ బాబుతో కలిసి ఆమె పాడారు నిన్నాడేమన్నంటినా తిరుపతి పాటను కూడా ఈ అమ్మాయి పాడింది.

 
పుష్ప-1 లో  సామీ సామీ పాటను ఫోక్ సింగర్ లక్ష్మి పాడారు. ఈ పాట సూపర్ డూపర్ హిట్టయింది. ఎవరీ లక్ష్మీదాస నిర్మల్ జిల్లా ముథోల్ మండలం గన్నోర గ్రామానికి చెందిన దాస లక్ష్మణ్, దాస జయశ్రీల కూతురే లక్ష్మీ. చిన్నప్పటి నుంచి జానపదగీతాలు పాడుతూ ఉండేది. ఆమెలోని టాలెంట్ ను గుర్తించిన సంగీత దర్శకులు రఘు కుంచె ఆమెకు తొలిసారి సినిమాలో పాడే అవకాశం కల్పించారు. 


తన మొదటిపాట బ్యాచ్ సినిమాలో ఆమె తన తొలి పాటను పాడారు. తర్వాత నాని నటించిన దసరా సినిమాలో ధూమ్ ధాం  సాంగ్ పాడారు. 2017లో యూట్యూబ్‌లో రిలీజైన ఓ బావో సైదులు పాటతో తనకు మంచి గుర్తింపు వచ్చింది..జీఎల్ నాందేవ్ గైడెన్స్‌లో 300-400 జానపద పాటలు పాడిన లక్ష్మీ..ఈ పాటలు సుకుమార్ ను అట్రాక్ట్ చేశాయి అప్పుడు వచ్చిన అవకాశమే పుష్ప-2 సాంగ్ . ఇప్పుడు పీలింగ్స్ సాంగ్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న సింగర్ లక్ష్మి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu lakshmi pushpa2 singer

Related Articles