Union Budget : బడ్జెట్ ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్

పార్లమెంట్ లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-23/1721723491_stockmarketnirmala.jpg

న్యూస్ లైన్ డెస్క్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ స్టాక్ మార్కెట్ కి గట్టి స్ట్రోక్ ఇచ్చింది. ఇటు బడ్జెట్ ప్రకటన రాగానే.. స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ 600 పాయింట్ల పైన, నిఫ్టీ 200 పాయింట్ల పైన నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉద్యోగ, ఉపాధి కల్ప, మౌలిక వసతులు, వ్యవసా రంగాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ స్టాక్ మార్కెట్ రెడ్ జోన్ లో ట్రేడ్ అవుతోంది.

మూలధన పెట్టుబడులపై వచ్చే లాభాల మీద పన్ను రేటు పెంచడమే ఇందుకు కారణమని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. దీనికి తోడు.. డాలర్ తో రూపాయి విలువ 83 రూపాయల 69 పైసలకు పడిపోయింది. క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ లాభాల మీద పన్నులు పెంచడాన్ని ఇన్వెస్టర్లు స్వాగతించలేదు. దీంతో.. ఓ దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగానే నష్టాల్లోకి వెళ్లింది.  ఆ తర్వాత 400 పాయింట్లు రికవరీ అయి 600 పాయింట్ల నష్టానికి చేరింది.  బ్యాంకింగ్, ఆయిల్, ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రియాల్టీ, ఐటీ, పోర్ట్, ఇన్ ఫ్రా షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : pm-modi latest-news centralbudget nirmalasitharaman unionbudget

Related Articles