Kejriwal: కేజ్రీవాల్ బెయిల్‌పై హైకోర్టు స్టే  2024-06-25 15:23:21

న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. కేజ్రీవాల్‌ బెయిల్‌పై స్టే కొనసాగుతుందని హైకోర్టు పేర్కొంది. కేజ్రివాల్‌కు బెయిల్‌ ఇస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు తప్పుబట్టింది. ట్రయల్‌ కోర్టు రికార్డులు పరిశీలించకుండా బెయిల్‌ మంజూరు చేసిందని హైకోర్టు తెలిపింది. ప్రస్తుతం అరవింద్ కేజ్రివాల్ తీహార్‌ జైల్లోనే అన్నారు. కేజ్రీవాల్ కేసులో ఢిల్లీ లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ వచ్చింది. అయితే బెయిల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మంగళవారం కేజ్రీవాల్‌ పిటిషన్‌పై వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఈ నెల 26కు వాయిదా వేసింది.