నేపాల్ దేశంలో గత కొంతకాలంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశంలోని ప్రజలు రాచరిక పాలన కావాలని కోరుతూ రోడ్లపైకి ఎక్కి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి ఉద్యమకారులకు
-రాచరిక పాలన కావాలని నిరసన
- ర్యాలీలో యూపీ సీఎం యోగి ఫోటోలు
తెలంగాణం, న్యూస్లైన్ డెస్క్:నేపాల్ దేశంలో గత కొంతకాలంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశంలోని ప్రజలు రాచరిక పాలన కావాలని కోరుతూ రోడ్లపైకి ఎక్కి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి ఉద్యమకారులకు మరియు భద్రత సిబ్బందికి మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా భద్రతా సిబ్బంది టీయర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ హిందూ దేశ హోదా కోసం గత కొంతకాలంగా నిరసనలు చేస్తున్నామని అన్నారు.
మాపై భద్రత సిబ్బంది చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. 2008లో రాజు జ్ఞానేంద్ర రాచరిక పాలనను రద్దు చేశారు. అయితే దీనికంటే ముందు నేపాల్ హిందూ దేశంగా ఉండేది. రాచరిక పాలన ఎప్పుడైతే రద్దయిందో అప్పటినుంచి కమ్యూనిస్టు, మావోయిస్టు ప్రభుత్వ విధానాలతో పాలన కొనసాగుతూ వస్తోంది. ఈ పరిపాలన నచ్చని నేపాల్ ప్రజలు మాకు హిందూ దేశం గానే ఉండాలని కోరుతూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు.
ఇదే తరుణంలో రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ రాచరిక పాలన ప్రవేశపెట్టాలని నిరసనకారులకు మద్దతు తెలిపింది. ఇదే తరుణంలో ఈ ర్యాలీలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటోలు కూడా కనిపించడం కొసమెరుపు. అయితే యోగి ఆదిత్యనాథ్ ఫోటోలను పీఎం ముఖ్య సలహాదారు అయినటువంటి బీష్ణు రిమల్ సూచన మేరకే ప్రదర్శించామని తెలియజేశారు. అయితే దీనిపై బీష్ణు స్పందిస్తూ ఆర్పీసీ పార్టీ చేసిన ఆరోపణలను ఖండించారు.