న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తిరుమల బ్రహ్మోత్సవాలు ..కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అయితే ఈ ఉత్సవాల్లో పాల్గొనే వారు లక్షల్లో ఉన్నారు. అంతేనా శ్రీవారి సేవలకు వెళ్లేవారు దాదాపు ఈ సూచనలు తెలుసుకొని వెళ్తే ఇంకా హెల్ప్ అవుతుంది.ఈ నెల 8న సాయంత్రం 6:30 గంటల నుంచి.. రాత్రి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహనంపై విహరిస్తారు. అసలు స్వామి వారి సేవకు వెళ్లేటపుడు ఇలా ట్రై చెయ్యండి.
* భక్తులు లగేజీని తీసుకెళ్లకుండా.. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వెళ్లండి. అయితే మీ లగేజీ ని కౌంటర్ లో భధ్రపరుచుకొండి.
*ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వీలైతే భక్తులు ప్రజారవాణాను వాడుకొండి.
* ఆర్‌టీసీ బస్సుల్లో దాదాపు మూడు వేల రౌండ్ ట్రిప్పుల ద్వారా..3 లక్షల మంది ద్వారా ఆర్ టీసీ తీసుకువెళ్తుంది. సో రద్దీ ఉంటుందని భ్రమ పడకండి. బస్సులు వాడుకొండి.
*పార్కింగ్ స్థలాలను ఈజీగా గుర్తించడానికి క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేశారు. సో మీరు పార్క్ చేసిన తర్వాత వెంటనే ఫొటో తీసుకొని వెళ్లండి.
*భక్తులకు వైద్య సదుపాయాల కోసం.. మాడ వీధుల్లో నాలుగు మూలల్లో మొబైల్ క్లినిక్‌లు, 12 అంబులెన్స్‌లు, వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఏ మాత్రం ఆరో్గయం సరిగా లేదనిపించినా ..వెంటనే దగ్గర్లో ఉన్న వారిని ఈ సదుపాయాల కోసం అడగండి.
బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ వాహనసేవను తిలకించేందు 28 భారీ హెచ్‌డి డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. మీరు రద్దీ లోకి వెళ్లలేనంటే ...మొండిగా వ్యవహరించకుండా డిజిటల్ స్క్రీన్ లో చూడండి.
మీరు ఎక్కువ డబ్బును ఖర్చు చెయ్యకుండా ..దాదాపు అన్నీ ఫ్రీ గా అందిస్తున్నారు. కాస్త ఓపిక గా వెతకండి. శ్రీవారి సదుపాయాలు వాడుకొండి.