ఇదే తొలిసారి. 99.9 శాతం స్వఛ్ఛత కలిగిన బంగారం ధర శుక్రవారం రూ. 92,150 ఉండగా నేడు రూ.2,000పెరిగి రూ. 94,150 కి చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ అధికంగా ఉండడంతో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పసిడి ధర నిత్యం పెరుగుతూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వఛ్ఛమైన బంగారం ధర రూ. 94 వేల మార్కును దాటింది. దేశీయంగా పుత్తడి ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. 99.9 శాతం స్వఛ్ఛత కలిగిన బంగారం ధర శుక్రవారం రూ. 92,150 ఉండగా నేడు రూ.2,000పెరిగి రూ. 94,150 కి చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ అధికంగా ఉండడంతో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
2025 క్యాలెండర్ సంవత్సరంలో బంగారం ధర ఇప్పటివరకు 18 శాతం పెరిగింది. జనవరి 1 న రూ. 79,390 గా ఉన్న బంగారం ధర ఈ నాలుగు నెలల కాలంలో రూ. 15వేల రూపాయిలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 3,149 డాలర్లకు చేరుకుంది. అయితే, వెండి ధర స్వల్పంగా తగ్గింది. శుక్రవారం రూ.1,03,000గా ఉన్న వెండి ధర రూ.500 తగ్గింది.