హుండీ ఆదాయం రూ.3.04 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రత్యేక ప్రవేశ దర్శం టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో వెంకటేశుని దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. సోమవారం స్వామిని 73,007 మంది దర్శంచుకోగా ..25 733 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.04 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రత్యేక ప్రవేశ దర్శం టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తుంది.
టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. హుండీ ఆదాయం రూ.3.04 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇకపోతే, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 6 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది.
భక్తుల రద్దీకి అనుగుణంగా చాలా కీలకనిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనాల పరంగా మార్పులు చేపట్టనుంది. గతంలో బ్రేక్ దర్శనాల విషయంలో అనేక సిఫారసుల ద్వారా టికెట్లు పొందేందుకు వీలుండగా ఉండేది. కానీ, ఇప్పుడు దీనిని గణనీయంగా తగ్గించేందుకు టీటీడీ కసరత్తు మొదలుపెట్టింది. భక్తులకు మరింత సౌకర్యంగా దర్శనం కల్పించేందుకు, వసతి ఏర్పాట్ల కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు గానూ గూగుల్‌తో ఒప్పందాన్ని కూడా టీటీడీ పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది.