train : ఏ వయసు వరకు పిల్లలకు రైలులో హాఫ్ టికెట్ తీస్తారో తెలుసా ?

కొంత వయసు దాటిన పిల్లలకి కంపల్సరీ టికెట్ ఉండాలి. ఇంకొంతమంది సగం టికెట్స్ తీస్తుంటారు. అసలు ఏ వయసు పిల్లలకు రైలులో ఫ్రీ గా ప్రయాణించవచ్చో తెలుసుకుందాం.


Published Sep 08, 2024 11:59:00 AM
postImages/2024-09-08/1725777095_1628595597indianrailwaystrainstation1600x1200.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇండియన్ రైల్వే లో ఎంత తెలుసుకున్నా...ఇంకా మనకు తెలియని రూల్స్ ఎన్నో ఉంటాయి. అయితే సీటు రిజర్వేషన్, బెర్త్ రిజర్వేషన్..ఆర్ ఏసీ ఇలా చాలా ఉంటాయి. కాని చాలా మంది పిల్లలకు టికెట్లు తియ్యరు. బ్లైండ్ గా పిల్లలకు టికెట్టు అవసరం లేదనుకుంటారు. కాని కొంత వయసు దాటిన పిల్లలకి కంపల్సరీ టికెట్ ఉండాలి. ఇంకొంతమంది సగం టికెట్స్ తీస్తుంటారు. అసలు ఏ వయసు పిల్లలకు రైలులో ఫ్రీ గా ప్రయాణించవచ్చో తెలుసుకుందాం.


భారతీయ రైల్వే రూల్స్ ప్రకారం నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకు ఎటువంటి టికెట్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చు. కాని 5 నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రం సగం టికెట్ కాదు పూర్తి టికెట్ తియ్యాల్సిందే. బెర్త్ రిజర్వేషన్స్ మాత్రం డబ్బు ఫుల్ గా కట్టాల్సిందే.


బర్త్ అవసరం లేదనుకుంటే మాత్రం స్లీపర్ కోచ్‌లలో మీ పిల్లలకు సీటు అవసరం లేకపోతే సగం టికెట్ తీసుకోవచ్చు.  కాని పిల్లల్ల్ని వేరే సీటులో కూర్చోబెట్టకూడదు. పేరెంట్స్ సీటు లోనే కూర్చోబెట్టుకోవాలి. సగం టికెట్ తీసుకున్నా పిల్లలకు ప్రత్యేక సీటు కేటాయించబడదు.


5-12 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రత్యేక బెర్త్ అవసరమైతే ఫుల్ టికెట్ కొనుగోలు చేయాలి. ఛైల్డ్ ఏజ్ తో టికెట్ తీస్తే మీకు లోవర్ బెర్త్ ఫ్రిఫరెన్స్ కూడా ఉంటుంది. రిజర్వేషన్ సమయంలో 4 సంవత్సరాల లోపు పిల్లల వివరాలు కూడా అందించాలి. జనరల్ కోచ్‌లో 5-12 సంవత్సరాల లోపు పిల్లలకు సగం టికెట్ తీసుకోవాలి. బర్త్ కావాలంటే ఫుల్ టికెట్ ఇ్వాల్సిందే. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu train railway-department kids

Related Articles