Maharashtra: ఉద్యోగం తర్వాత చేస్తా..ఇళ్లు ..కారు ముందే ఇవ్వండి .. IAS ట్రైనీ !

కొంత మందికి అధికారం చేతిలో ఉంటే ..మిగిలినవన్నీ ..చాలా ఛీప్ గా కనిపిస్తాయి. ఆ పొజిషన్ కోసం ఎంత కష్టపడ్డారో మరిచిపోతారు..అధికారం చేతిలోకి రాగానే...అసలు రంగు చూపిస్తుంటారు.  మహారాష్ట్రలో ప్రొబేషన్ లో ఉన్న పూజా ఖేడ్కర్ అనే ట్రైనీ ఐఏఎస్. పుణే అసిస్టెంట్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకోక ముందే తనకు విడిగా ఓ ఇల్లు, కారు కావాలని ఆమె డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. 2023 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమె ఇప్పటికే తన సొంత కారుకు సైరన్, వీఐపీ నంబర్ ప్లేట్లు, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ అంటించుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 


Published Jul 11, 2024 11:46:00 AM
postImages/2024-07-11/1720678632_I2.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొంత మందికి అధికారం చేతిలో ఉంటే ..మిగిలినవన్నీ ..చాలా ఛీప్ గా కనిపిస్తాయి. ఆ పొజిషన్ కోసం ఎంత కష్టపడ్డారో మరిచిపోతారు..అధికారం చేతిలోకి రాగానే...అసలు రంగు చూపిస్తుంటారు.  మహారాష్ట్రలో ప్రొబేషన్ లో ఉన్న పూజా ఖేడ్కర్ అనే ట్రైనీ ఐఏఎస్. పుణే అసిస్టెంట్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకోక ముందే తనకు విడిగా ఓ ఇల్లు, కారు కావాలని ఆమె డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. 2023 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమె ఇప్పటికే తన సొంత కారుకు సైరన్, వీఐపీ నంబర్ ప్లేట్లు, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ అంటించుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 


పూణే అదనపు కలెక్టర్ అజయ్ మోరే బయటకు వెళ్లినప్పుడు ఆయన కార్యాలయాన్ని ఆమె ఉపయోగించుకున్నట్లు కూడా విమర్శలు ఉన్నాయి. వీటితో పాటు ఆయన నేమ్ ప్లేట్లను తొలగించిన ఖేడ్కర్ అఫిషియల్ లెటర్ హెడ్స్ కావాలని పట్టుబడుతున్నారట. అసలు ప్రొబేషన్ లో ఉన్న జూనియర్స్ కు ప్రభుత్వం ఏ సౌకర్యాలు కల్పించవు. 24 నెలల ప్రొబేషన్ కాలం కంప్లీట్ అయ్యాక ఐఏఎస్  హోదాతో పాటు లంచనాలన్నీ వస్తాయి. కానీ ఆమె తండ్రి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దిలీప్ ఖేడ్కర్ సైతం తన కుమార్తెకు ఈ సౌకర్యాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో వీళ్ల బాధపడలేక సర్కార్ ..ఇరిటేట్ అయ్యి కంప్లెయింట్ ఇచ్చే వరకు వచ్చింది.అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పుణే కలెక్టర్ సుహాస్ దివాసే ఆమెపై చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం పూజా ఖేడ్కర్ ను వాసిమ్ కు బదిలీ చేసింది. 


వాస్తవానికి పూజా ఖేడ్కర్ ను యూపీఎస్ సీ ఎంపిక చేయడంపైనా వివాదం కొనసాగుతోంది. పాక్షిక అంధత్వం, మనోవైకల్యంతో బాధపడుతున్నట్లు కాగితాలు సమర్పించిన పూజా ఖేడ్కర్ ఆ కోటోలో యూపీఎస్ సీ ఎంపిక ప్రక్రియలో సెలక్టయ్యారు. దీనికి కావాల్సిన వైద్యపరీక్షలు మాత్రం చేయించుకోవడానికి ఒప్పుకోలేదు. ఐదుసార్లు నోటీసులు వచ్చినా పట్టించుకోలేదు. టెస్ట్ లన్నీ ..గవర్నమెంట్ నుంచి కాకుండా ప్రయివేట్ ఆసుపత్రి నుంచి రిపోర్టులు సబ్మిట్ చేశారు. 2023 ఫిబ్రవరిలో క్యాట్ ఆమెకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఆమె పోస్టింగ్ తెచ్చుకున్నారు.


పూజా ఖేడ్కర్ ఓబీసీ నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్ ను సమర్పించడంపైనా వివాదం కొనసాగుతోంది. ఆమె తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ దిలీప్ ఖేడ్కర్ పేరిట రూ. 40 కోట్లు, తల్లి మనోరమ పేరిట రూ. 15 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తేలింది. అలాగే జాయినింగ్ కు ముందు తన పేరిట రూ. 17 కోట్ల విలువైన స్థిరాస్తులు, వాటిపై రూ. 43 లక్షల వార్షికాదాయం వస్తున్నట్లు యూపీఎస్ కి సమర్పించిన డిక్లరేషన్ లో పూజా వెల్లడించారు. ఈ మేడం పేరిట పరీక్ష పాసైన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా పెద్ద రచ్చే నడిచింది.

newsline-whatsapp-channel
Tags : collectors maharastra prohibition-period trainee-ias-

Related Articles