ఇందుకే అంటారు...ఓవరాక్షన్ "మాడబాడరదు" ..అని అదేనండి చెయ్యకూడదు. మీకు తెలుసుగా మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ గురించి ఓ రేంజ్ లో వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ ట్రైనీ ఐఏఎస్ తిక్క కుదురుస్తూ ...ట్రాన్స్ ఫర్ ఇచ్చారు. పూజా ఖేద్కర్ లగ్జరీ ఆడి కారును పూణె ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. మోటారు వాహనాల చట్టం నిబంధనలను ఉల్లంఘించి తన ప్రైవేటు కారుపై వీఐపీ నంబర్ ప్లేట్, కారుపై రెడ్, బ్లూకలర్ బీకన్ ఏర్పాటు చేసుకోవడంతోపాటు అందులోను ఏకంగా కలక్టర్ తనకు వ్యతిరేకంగా కంప్లెయింట్ ఇవ్వడంతో తన కారును సీజ్ చేశారు. పర్మిషన్ లేకుండా ఈ చర్యలు చేయకూడదని వారించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇందుకే అంటారు...ఓవరాక్షన్ "మాడబాడరదు" ..అని అదేనండి చెయ్యకూడదు. మీకు తెలుసుగా మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ గురించి ఓ రేంజ్ లో వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ ట్రైనీ ఐఏఎస్ తిక్క కుదురుస్తూ ...ట్రాన్స్ ఫర్ ఇచ్చారు. పూజా ఖేద్కర్ లగ్జరీ ఆడి కారును పూణె ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. మోటారు వాహనాల చట్టం నిబంధనలను ఉల్లంఘించి తన ప్రైవేటు కారుపై వీఐపీ నంబర్ ప్లేట్, కారుపై రెడ్, బ్లూకలర్ బీకన్ ఏర్పాటు చేసుకోవడంతోపాటు అందులోను ఏకంగా కలక్టర్ తనకు వ్యతిరేకంగా కంప్లెయింట్ ఇవ్వడంతో తన కారును సీజ్ చేశారు. పర్మిషన్ లేకుండా ఈ చర్యలు చేయకూడదని వారించారు.
21సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు రూ. 26 వేల జరిమానా కూడా విధించారు. దీనికి గాను ట్రాఫిక్ విభాగం నోటీసులు జారీచేయడంతో శనివారం రాత్రి ఖేద్కర్ కుటుంబ డ్రైవర్ కారు తాళాలు తీసుకెళ్లి చతుష్రింగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు. కారు డాక్యుమెంట్లు ఇంకా పోలీసులకు అందించలేదు. 34 ఏళ్ల పూజ ఖేద్కర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం , యూపీఎస్సీ ఎంపిక లోను మతలబులున్నాయని తెలియడం తో సోషల్ మీడియా ఫుల్ ఫైర్ అయిపోతున్నారు. మెంటల్ స్టెబులిటీ లేకుండా యూపీఎస్సీ రాయంకు ఎలా కొట్టిందని వాదిస్తున్నారు. తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం, దురుసు ప్రవర్తన, యూపీఎస్‌సీ ఎంపికలో అక్రమాలకు పాల్పడడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.