ఇందులో కళ్యాణోత్సవం , ఊంజల్ సేవ , ఆర్జిత బ్రహోత్సవం , సహస్రదీపాలంకరణ లాంటి సేవలకు టికెట్లు ఆన్ లైన్ రిలీజ్ చేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం ఫిబ్రవరి 2025 నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను గురువారం ఆన్ లైన్ లో విడుదల చేసింది. ఇందులో కళ్యాణోత్సవం సేవా టికెట్లు కోటాను ఈ రోజు ఆన్ లైన్ లో విడుదల చేసింది. ఇందులో కళ్యాణోత్సవం , ఊంజల్ సేవ , ఆర్జిత బ్రహోత్సవం , సహస్రదీపాలంకరణ లాంటి సేవలకు టికెట్లు ఆన్ లైన్ రిలీజ్ చేశారు.
ఫిబ్రవరి నెలకు సంబంధించిన వర్చువల్ సేవలు మరియు దర్శన స్లాట్‌ల కోటాను నవంబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అయితే అంగప్రదక్షిణ టోకెన్లు సంబంధించిన ఫిబ్రవరి కోటాను నవంబర్ 23న ఉదయం 10 నుంచి 11 గంటలకు రిలీజ్ చెయ్యలనున్నట్లు తెలిపారు టీటీడీ అధికారులు.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి కోసం ఫిబ్రవరి నెల ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను నవంబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అయితే ఈ టికెట్లు అర్హులైన వారు వాడుకోవాలని కోరారు. ఫిబ్రవరి లో స్పెషల్ టికెట్ల కోటాను నవంబర్ న ఉదయం గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
తిరుమల మరియు తిరుపతిలో ఫిబ్రవరి నెల గదుల కోటాను నవంబరు 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఇలా ప్రతి కేటగిరి లో టికెట్లను 23 నుంచి ఈ టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. మరిన్ని బుకింగ్స్ చేయడానికి https://ttdevasthanams.ap.gov.in ను సందర్శించాలని టీటీడీ సూచించింది.