Bhole Baba : ఎవరీ భోలే బాబా ...హత్రాస్ ప్రమాదం ఎందుకు జరిగింది?

Published 2024-07-03 19:06:21

postImages/2024-07-03/1720013781_msid111435888imgsize365706.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హత్రాస్ ( hathras)  ప్రమాదంలో వందలమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. తొక్కిసిలాట జరిగింది సరే...అసలు ఎందుకు జరిగింది ..దేనికి ఈ ప్రమాదానికి కారకులెవరో మాత్రం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. 


ఉత్తరప్రదేశ్‌లోని( up)  హత్రాస్ జిల్లా రతిభాన్ పూర్ ( rathibhanpur)  గ్రామంలో భోలే బాబా ( bholebaba) అనే ఆధ్యాత్మికవేత్త నిర్వహించిన సత్సంగ్ ( sathsang) లో తొక్కిసలాట చోటు చేసుకున్నదే ఈ ప్రమాదం. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు కారణం 5వేల మంది మాత్రమే పట్టే ప్లేసులో ..దాదాపు 15వేల మందితో సత్సంగ్ అంటే ..ప్రవచనం అనుకొండి. దీని వల్లే దాదాపు 125 మందికి పైగా చనిపోయారు. అసలు ఏ దేవునికి ఈ పూజలు, ప్రవచనాలు అంటారా ..


రతిబాన్ పూర్( rathibhanpur)  గ్రామంలో ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించిన భోలే బాబా అసలు పేరు సౌరబ్ కుమార్( sowrabh kumar) . ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎటాహ్ జిల్లాలోని బహుదూర్( bahudur)  గ్రామంలో ఈయన జన్మించారు. ప్రస్తుతం ఈ బాబా వయసు 50 ఏళ్లకు పైబడే. ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో(police department)  ఇంటిలిజెన్స్ బ్యూరో( intelligence bureau) లో దాదాపు 18 సంవత్సరాలు పనిచేశారు . ఎందుకో సడన్ గా ఖాకీ చొక్కా వదిలేసి...తెల్లబట్టలు కట్టుకున్నారు. తెల్లని సూటు, టై వేసుకొని ప్రవచనాలు చెబుతుంటారు. ఆయన ఇప్పుడు సకర్ విశ్వహరి భోలే బాబా( sakar vishwahari bhole baba) ..ధర్మ ప్రవచనాలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారు.


భోలే బాబా ప్రవచనాలు ఎప్పుడు మంగళవారమే జరుగుతుంటాయి. బాబా పక్కన ఆయన భార్య కూడా ఉంటారు. బాబాకు యూపీతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ లక్షలాదిమంది భక్తులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వెనుకబడిన తరగతులకు చెందిన వారే. బాబా భక్తుల్లో అనేకమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉండడం విశేషం. ఒక్క మాటలో చెప్పాలంటే నార్త్ వైపు ఈ భోలే బాబా మరో అమ్మా...భగవాన్ దంపతుల లాగే. వీరి భక్తుల్లో దాదాపు ఎంపీ , ఎమ్మెల్యే స్థాయి నుంచి దిగువ తరగతి వారే ఎక్కువ.  


ఈ భోలే బాబా సత్సంగ్ మొదటి సారి కాదు వార్తల్లోకి రావడం ...కరోనా ( covid) వైరస్ ఉధృతి సమయంలో వివాదంలో చిక్కుకున్నారు. 2022 మేలో సత్సంగ్ నిర్వహించేందుకు పర్మిషన్ అడిగారు . అది కూడా కేవలం 50 మందికి కానీ 50 వేల మందికిపైగా భక్తులు ఈ సత్సంగ్ కు హాజరయ్యారు. ఆ ప్రవచనం తర్వాత కోవిడ్ కేసులు మరింత పెరిగాయి. అప్పట్లో ఈ సత్సంగ్ చాలా పెద్ద దుమారం రేపింది. ఎప్పుడు మీడియాకు దూరంగా ఉండే బాబా ఈ వార్తతో అందరి దృష్టిలో పడ్డారు.


అంతేకాదు ఇప్పుడు కూడా ప్రమాదం ఎలా జరిగిందంటే భోలే బాబా పాదధూళి కోసం జనాలు ఎగబడ్డారు. దీని వల్ల తొక్కిసలాట జరిగి ఇంతమంది చనిపోయారు. 125 మంది చనిపోయారు. మరో 150 మందికి గాయాలయ్యాయి. చాలా మంది ఊపిరిఆడక  చనిపోయిన వారేనంటూ డాక్టర్లు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. దేశంలోని ప్రముఖులంతా ...ఇప్పటికే సంతాపం తెలియజేస్తున్నారు.