తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి హీరోలలో టాప్ హీరో అంటే అందరికీ గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. ఈయనకి ఆరు పదుల వయస్సు దాటినా కానీ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు. కేవలం సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతూ దూసుకుపోతున్నారు చిరంజీవి. అలాంటి చిరంజీవి తన కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అలా చిరంజీవి నటించినటువంటి మూవీలో డిఫరెంట్ గా ఉండే మూవీ దొంగ.
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి హీరోలలో టాప్ హీరో అంటే అందరికీ గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. ఈయనకి ఆరు పదుల వయస్సు దాటినా కానీ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు. కేవలం సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతూ దూసుకుపోతున్నారు చిరంజీవి. అలాంటి చిరంజీవి తన కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అలా చిరంజీవి నటించినటువంటి మూవీలో డిఫరెంట్ గా ఉండే మూవీ దొంగ.
1985లో విడుదలైన ఈ మూవీ కోదండరామిరెడ్డి డైరెక్షన్ వహించారు. విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై వచ్చిన ఈ మూవీని టీ. త్రివిక్రమరావు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అయితే చిరంజీవి సరసన కథానాయికగా రాధా నటించింది. ఈ సినిమాలో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి సంగీతం అందించారు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఫేమస్ నటీనటులు అయినటువంటి అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు, గొల్లపూడి మారుతీరావు,కూడా నటించారు. అలాంటి ఈ మూవీ 1985 మార్చి 14వ తేదీన థియేటర్లలోకి వచ్చి విజయం సాధించింది.
అలాంటి ఈ చిత్రంలో గోలీమార్ అనే సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ లో చిరంజీవి వేషధారణ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంతే కాదు ఇందులో చాలా డిఫరెంట్ డాన్స్ కూడా చేస్తారు. అయితే ఈ డాన్స్ స్టెప్పులను ప్రపంచంలోనే ఫేమస్ డాన్సర్ గా పేరుపొందిన మైఖేల్ జాక్సన్ నుంచే కాపీ కొట్టినట్టు తెలుస్తోంది. మైకల్ జాక్సన్ చేసినటువంటి ఒక డ్యాన్స్ వీడియో మరియు చిరంజీవి చేసినటువంటి గోలీమార్ పాట డాన్స్ వీడియో స్టేప్పులు ఒకే విధంగా ఉన్నాయి.
అంటే మైకేల్ జాక్సన్ నుంచి ఈ డ్యాన్సును కాఫీ చేసి, దొంగ సినిమాలో గోలీమార్ పాటకు సెట్ చేసినట్టు ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.