ఎవర్రా మీరంతా..కుక్క బర్త్డే కు మూడున్నర తులాల బంగారం గిఫ్ట్.!

సాధారణంగా పల్లెటూరులో చాలామంది జనాలు ఏం బతుకు రా కుక్క బతుకు అని అంటూ ఉంటారు. ప్రస్తుతం అలాంటి కుక్కలకే  విలాసవంతమైనటువంటి జీవనం ఉంటోంది. ఇతర దేశాల్లో అయితే మనుషుల కంటే ఎక్కువ వ్యాల్యూ కుక్కలకే ఇస్తారు. ఆ సాంప్రదాయం మన ఇండియాకు కూడా చేరింది.  ఇంట్లో పెంచుకునే శునకం కోసం లక్షల నుంచి కోట్లు ఖర్చు చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. అంతేకాదు కుటుంబంలో మనిషి పోయిన పెద్దగా బాధపడరు కానీ, ఒకవేళ శునకం చనిపోయిందంటే  చాలా చిందించే వాళ్ళు ఉంటారు.


Published Jul 06, 2024 07:10:12 AM
postImages/2024-07-06/1720267780_dogchain.jpg

న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా పల్లెటూరులో చాలామంది జనాలు ఏం బతుకు రా కుక్క బతుకు అని అంటూ ఉంటారు. ప్రస్తుతం అలాంటి కుక్కలకే  విలాసవంతమైనటువంటి జీవనం ఉంటోంది. ఇతర దేశాల్లో అయితే మనుషుల కంటే ఎక్కువ వ్యాల్యూ కుక్కలకే ఇస్తారు. ఆ సాంప్రదాయం మన ఇండియాకు కూడా చేరింది.  ఇంట్లో పెంచుకునే శునకం కోసం లక్షల నుంచి కోట్లు ఖర్చు చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. అంతేకాదు కుటుంబంలో మనిషి పోయిన పెద్దగా బాధపడరు కానీ, ఒకవేళ శునకం చనిపోయిందంటే  చాలా చిందించే వాళ్ళు ఉంటారు.

అలాంటి ఓ ప్రేమికురాలే  తాను పెంచుకున్న  శునకానికి  పుట్టినరోజు సందర్భంగా అద్భుతమైన గిఫ్ట్ అందించింది. ఇంతకీ ఆమె ఇచ్చింది ఏంటయ్యా అంటే.. బంగారం.. తన పెంపుడు కుక్కకు పుట్టినరోజు సందర్భంగా  మూడున్నర తులాల బంగారు గొలుసు చేయించి మెడలో వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.  

https://www.instagram.com/reel/C8RlfMtSJ53/?igsh=d2h2d2xqNW1menRh

ముంబైలోని చెంబూరు ప్రాంతానికి చెందిన సల్తాహన  అనే మహిళ ఇటీవల తన పెంపుడు కుక్క  టైగర్ ను తీసుకొని జువెలరీ షాప్ కు వెళ్ళింది. తన పెంపుడు  శునకం కోసం  మూడున్నర తులాల బంగారు గొలుసు కొని తన మెడలో వేసింది.  ఈ సమయంలోనే ఆ శునకం ఆనందంగా అటు ఇటు గంతులు వేయడం చూడవచ్చు. అయితే ఈ వీడియోను జువెలరీ షాప్ కు చెందిన యజమాని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది. దీంతో ఆ శునకంపై ఆమెకున్న ప్రేమను మెచ్చుకుంటూ  చాలామంది రకరకాల కామెంట్లు పెడుతూ లైక్ కొడుతూ షేర్ చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu mumbai birthday dog-gift gold-chain

Related Articles