ఈ ప్రభుత్వం ఎంతసేపు ఇతర పార్టీల నుంచి ప్రజా ప్రతినిధులను చేర్చుకొని రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని అన్నారు. హైదరాబాద్ రిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్క ప్రజా ప్రతినిధి గెలవలేదని, మొత్తం బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, గెలవడంతో నగరాభివృద్ధిని గాలికి వదిలేశారని ఆయన వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత హైదరాబాద్ నగరాభివృద్ధిని గాలికి వదిలేశారని బీఆర్ఎస్ నేత, ఖుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. శనివారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగర ప్రజలపై కక్ష్యపూరిత వైఖరి చూపుతోందని ఆరోపించారు.
ఈ ప్రభుత్వం ఎంతసేపు ఇతర పార్టీల నుంచి ప్రజా ప్రతినిధులను చేర్చుకొని రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని అన్నారు. హైదరాబాద్ రిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్క ప్రజా ప్రతినిధి గెలవలేదని, మొత్తం బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, గెలవడంతో నగరాభివృద్ధిని గాలికి వదిలేశారని ఆయన వెల్లడించారు.
తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయవంటిదనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని వివేకానంద్ సూచించారు. హైదరాబాద్ అభివృద్దే రాష్ట్రాభివృద్ధిపై తప్పక ప్రభావం చూపుతుందని తెలిపారు. అవగాహన లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్లను ఏర్పాటు చేశారని అన్నారు. వారికి కనీస మెజారిటీ కూడా లేదని అన్నారు. ఇలా చేసి ప్రభుత్వం తప్పుడు సంప్రదాయానికి తెరలేపిందని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. లేదంటే అన్ని వేదికలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని వివేకానంద్ హెచ్చరించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా బీఆర్ఎస్ నేతల బాధ్యత అని తెలిపారు.