Bonalu: బోనాల సంబురాల కోసం సర్కార్ ఎంత మంజూరు చేసిందంటే..?

రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, సెక్రటరీ హన్మంతరావు , హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురేషెట్టి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరిక్రిష్ణతో పాటు వివిధ దేవాలయాల కమిటీల సభ్యులు పాల్గొన్నారు. ఈవెంట్ క్యాలెండర్, బోనాల ఉత్సవాల పోస్టర్, బోనాల పండుగ పై మామిడి హరికృష్ణ రాసిన పుస్తకం, బోనాల పండుగ పాటను మంత్రులు కొండ సురేఖ,పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. 


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-06/1720270765_modi41.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఆదివారం నుండి రాష్ట్రంలో బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే సంబురాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.   బోనాల దశాబ్ద ఉత్సవాలు-2024కి సంబంధించిన దేవాలయాల కమిటీలకు చెక్కులను పంపిణీ చేసేందుకు శనివారం బేగంపేట హోటల్ హరితా టూరిజం ప్లాజా వద్ద మంత్రులు కొండ సురేఖ,పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, సెక్రటరీ హన్మంతరావు , హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురేషెట్టి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరిక్రిష్ణతో పాటు వివిధ దేవాలయాల కమిటీల సభ్యులు పాల్గొన్నారు. ఈవెంట్ క్యాలెండర్, బోనాల ఉత్సవాల పోస్టర్, బోనాల పండుగ పై మామిడి హరికృష్ణ రాసిన పుస్తకం, బోనాల పండుగ పాటను మంత్రులు కొండ సురేఖ,పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. 

కాగా, ఆషాఢ మాస బోనాల ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రులు తెలిపారు. ఈ క్రమంలోనే బోనాల పండుగ కోసం వివిధ దేవాలయాలకు చెక్కులు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆషాఢ మాస దశాబ్ది బోనాల ఉత్సవాలు ప్రభుత్వం నుండి ఘనంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగర సంస్కృతి సాంప్రదాయాలను రాష్ట్ర ,దేశ వ్యాప్తంగా నిలిచేలా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. శాంతి భద్రతలను కాపాడుతూ ఉత్సవాలను విజయవంతం చేయడానికి అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. 

newsline-whatsapp-channel
Tags : india-people newslinetelugu minister telanganam bonalu bonalu-festival

Related Articles